ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిథిలావస్థలో కపిలేశ్వరపురం లాకులు

ABN, First Publish Date - 2022-09-08T06:44:13+05:30

కపిలేశ్వరపురంలో 1942లో బ్రిటిష్‌ హయాంలో నిర్మించిన లాకులు శిథిలావస్థకు చేరుకు న్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన లాకులు అధ్వానం

 పట్టించుకోని అధికారులు  వృథాగా పోతున్న సాగునీరు ఫ పాడైన సిబ్బంది క్వార్టర్స్‌   

కపిలేశ్వరపురం, సెప్టెంబరు 7: కపిలేశ్వరపురంలో 1942లో బ్రిటిష్‌ హయాంలో నిర్మించిన లాకులు శిథిలావస్థకు చేరుకు న్నాయి. సాగునీటి ప్రవాహాన్ని కట్టడిచేసి మెరక ప్రాంతాలకు నీరందించేందుకు లాకులు నిర్మించారు. 36,388ఎకరాల ఆయ కట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో నిర్మించిన లాకులు నిర్వ హణ సక్రమంగా లేకపోవడంతో అధ్వానంగా తయారయ్యా యి. అయితే లాకుల తలుపులకు రంధ్రాలుపడి లీకేజీలతో నీరు వృథాగాపోతుంది.  అయితే వాటిని అధికారులు పట్టిం చుకున్న దాఖలాలులేవు. ప్రస్తుతం ఎగువ,దిగువ లాకులు మూతబడి, తెరుచుకునే కంట్రోల్‌ సిస్టం సక్రమంగా పని చేయడంలేదు. గతంలో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నప్పుడు ఈలాకులకు మరమ్మతులుచేసి కొత్త తలుపులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాని ఆ నిర్ణయం మాత్రం అమలుకు నోచుకోలేదు. దీంతో సాగునీరు వృథాగా పోతుంది.  ఇక్కడ పనిచేసే సిబ్బంది పూర్తిస్థాయిలో లేరు. సిబ్బంది నివసించేందుకు నిర్మించిన క్వార్టర్లు శిథిలావస్థకు  చేరడంతో నివాసయోగ్యంగా లేవు. దీంతో సిబ్బంది బయట ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. ఈప్రాంతం విషసర్పాలకు నిలయంగా మారడంతో సిబ్బంది భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణం  స్పందించి లాకులకు మరమ్మతులు చేపట్టి, కొత్తగా క్వార్టర్లు నిర్మించాలని రైతులు, మండల ప్రజలు కోరుతున్నారు.లాకులు



Updated Date - 2022-09-08T06:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising