6 నుంచి బొమ్మూరులో కళా ఉత్సవ్
ABN, First Publish Date - 2022-12-02T00:41:32+05:30
విద్యార్థుల్లో దాగి ఉండే కళా నైపుణ్యాలను వెలికితీసి ప్రోత్సహించేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు-2022ను బొమ్మూరు డైట్ సెంటర్‌లో నిర్వహిస్తామని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఏఎన్‌ఆర్ సుబ్రహ్మణ్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అమలాపురం టౌన్, డిసెంబరు 1: విద్యార్థుల్లో దాగి ఉండే కళా నైపుణ్యాలను వెలికితీసి ప్రోత్సహించేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు-2022ను బొమ్మూరు డైట్ సెంటర్‌లో నిర్వహిస్తామని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఏఎన్‌ఆర్ సుబ్రహ్మణ్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6, 7 తేదీల్లో గాత్ర సంగీతం, వాద్య పరికరాల సంగీతం, నృత్యం, దృశ్యకళలు, డ్రామా తదితర పది విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. 9, 10, 11, 12 తరగతులు చదువుతూ డివిజన్ స్థాయిలో ఎంపికైన విద్యార్థులు ఈ పోటీలకు అర్హులు. సంబంధిత ధ్రువపత్రాలతో పోటీలకు హాజరుకావాలని కోరారు. ప్రతిభ కనబరిచిన వారిని బాలుర, బాలికల విభాగాల్లో ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు 40 మందిని పంపిస్తారు. మరిన్ని వివ రాలకు కేవీ సూర్యనారాయణ, (9949602721), కె.గంగాధరరావు (9440339416)లను సంప్రదించాలన్నారు.
Updated Date - 2022-12-02T00:41:34+05:30 IST