ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా చాతుర్మాస్య దీక్షలు

ABN, First Publish Date - 2022-08-14T05:59:37+05:30

సర్పవరం జంక్షన్‌, ఆగస్టు 13: కంచి కామకోటి పీఠాధిపతి, జగద్గురువు శ్రీశంకర జయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో తిమ్మాపురం ఆకొండి లక్ష్మీస్మారక గోశాల ప్రాంగణంలో 39వ చాతుర్మాస్య దీక్షలు వైభవంగా జరుగుతున్నా యి. నిత్యం స్వామీజీ ఏకాంతంగా శ్రీమహా త్రిపుర సుందరి సమేత

భక్తుల నుంచి పండ్లు స్వీకరిస్తున్న స్వామీజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

32 రోజులకు చేరిన మహాక్రతువు

సర్పవరం జంక్షన్‌, ఆగస్టు 13: కంచి కామకోటి పీఠాధిపతి, జగద్గురువు శ్రీశంకర జయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో తిమ్మాపురం ఆకొండి లక్ష్మీస్మారక గోశాల ప్రాంగణంలో 39వ చాతుర్మాస్య దీక్షలు వైభవంగా జరుగుతున్నా యి. నిత్యం స్వామీజీ ఏకాంతంగా శ్రీమహా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరుని యోగలింగ నిత్య త్రికాల పూజలు నిర్వహిస్తున్నారు. చాతుర్మాస్య దీక్షా మహాక్రతువు శనివారానికి 32 రోజులకు చేరింది. ఈ దీక్షలో ఆగస్టులో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విశిష్టత, ప్రాధాన్యాలపై చాగంటి కోటేశ్వరరావు, కామ కోటిపీఠం శ్రీకార్యం చల్లా విశ్వనాధశాస్త్రి ముఖ్యసభ్యులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక సహస్రాబ్ధి(1022-2022) సందర్భంగా ఆదివారం జరిగే తెలుగు మహాభారత సహస్రాబ్ధి ఉత్సవాలకు తెలుగు భాషా సాహిత్య పండితులు, ఆచార్యులు, ప్రవచనకారులు పాల్గొంటారని, స్వామీజీ విచ్చేసి అనుగ్రహ భాష ణం చేస్తారని తెలిపారు. చాతుర్మాస్యం గురుప్రియం సంగీత ఉపాసనలో భాగంగా వైజాగ్‌కు చెందిన రాజేశ్వరి సాయినాథ్‌, వైష్ణవి బృందం నిర్వహించిన లలిత వైభవం భరతనాట్య సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.

Updated Date - 2022-08-14T05:59:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising