ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు

ABN, First Publish Date - 2022-01-23T05:14:26+05:30

భానుగుడి (కాకినాడ), జనవరి 22: జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని స్కానింగ్‌ సెంటర్లలో గర్భస్త లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో చిన్నికృష్ణ హెచ్చరించారు. తన కార్యాలయంలో శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి డివిజన్‌ స్థాయి పీసీ, పీఎన్‌డీటీ చట్టం అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో చిన్నికృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ 

భానుగుడి (కాకినాడ), జనవరి 22: జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని స్కానింగ్‌ సెంటర్లలో గర్భస్త లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో చిన్నికృష్ణ హెచ్చరించారు. తన కార్యాలయంలో శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి డివిజన్‌ స్థాయి పీసీ, పీఎన్‌డీటీ చట్టం అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ఆయా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ డివిజన్‌స్థాయిలో గుర్తింపు పొందిన 92 స్కానింగ్‌ సెంటర్లపై డెకాయ్‌ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రతి స్కానింగ్‌ సెంటర్ల వద్ద పీసీ, పీఎస్టీటీ చట్టానికి సంబంధించిన బోర్డులను, వాల్‌ పోస్టర్లను, ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్‌ సీహెచ్‌వీ భరతలక్ష్మి, డాక్టర్‌ బీబీ మోమినా, ఎన్‌జీవో ప్రతినిధి కె.సింహాద్రి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T05:14:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising