ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాటు లేదు.. పరిహారం రాదు

ABN, First Publish Date - 2022-05-29T07:42:21+05:30

సముద్రంలో వేట నిషేధం అమలు చేసి నేటికి 45 రోజులు కావస్తోంది. ఏప్రిల్‌ 14నుంచి జూన్‌ 15 వరకు సముద్రంలో మత్స్యసంపద పునరుత్పత్తి చెందుతుందనే ప్రభుత్వ నిబంధనల మేరకు ఏటా 61రోజుల పాటు వేట నిషేధం అమలవుతోంది.

ఉప్పాడలో వలలు మరమ్మతులు చేసుకుంటున్న మత్స్యకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపల్లి, మే 28: సముద్రంలో వేట నిషేధం అమలు చేసి నేటికి 45 రోజులు కావస్తోంది. ఏప్రిల్‌ 14నుంచి జూన్‌ 15 వరకు సముద్రంలో మత్స్యసంపద పునరుత్పత్తి చెందుతుందనే ప్రభుత్వ నిబంధనల మేరకు ఏటా 61రోజుల పాటు వేట నిషేధం అమలవుతోంది. రెండు నెలల కాలంలో మత్స్యకారులకు పాటు(వేట) చేయకపోవడంతో ప్రభుత్వం రెండునెలలకు గుర్తింపు పొందిన బోట్లకు చెందిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10వేల వేట భృతి చెల్లిస్తోంది. కొత్తపల్లి మండలంలో ఉప్పాడ, సుబ్బంపేట, కొత్తపట్నం, మాయాపట్నం, సూరాడపేట, జగ్గరాజుపేట, అమీనబాద్‌, మూలపేట, పల్లిపేట, కోనపాపపేట తదితర మత్స్యకార గ్రామాలున్నాయి. వీరిలో అధికశాతం  మత్స్యకారులకు వేటపరిహారం నేటికీ మంజూరు కాలేదు. 61రోజుల వేట నిషేధంలో ఇప్పటికే 45రోజులు పూర్తి కావస్తోంది. ఇప్పటికీ తీరప్రాంతాలకు చెందిన అధికశాతం మత్స్యకారులకు వేట పరిహారం  మంజూరు కాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం నెలకు రూ.5వేలు చెల్లిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో పరిహారం కింద ఇచ్చిన ఆ మొత్తం కనీసం వారం రోజులకు సరిపడ సరుకులు రావడంలేదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. పరిహారం అందిన వాళ్ల పరిస్థితి ఇలా ఉండగా ఇక పరిహారం అందని మత్స్యకారులు చేసిన అప్పులకు వడ్డీలు ఎలా కట్టాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో మత్స్యకారులందరికీ వేట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు.

వేట మానేశాం.. మాకు పరిహారం ఏది?

-సత్తిబాబు,మత్స్యకారుడు ఉప్పాడ

సముద్రంలో చేపలు పెరుగుతాయని వే ట మానేశాం. అందరూ ఒకే మాటపై ఉం డి వేట చేయకుండా నిషేధం అమలు చే స్తున్నాం. ప్రభుత్వం చెల్లించే భృతి రాలేదు. ఇప్పటికే 45రోజులు వేట నిషేధం అమలు చేశాం. ఇంకో  15 రోజుల్లో చేపల వేటకు వెళ్లే సమయం వచ్చింది. ఇంకెపుడు ఇస్తారు వేట పరిహారం. ఏం తినాలి, ఎలా బతకాలి.

చెల్లింపుల్లో చుక్కలు చూపెడుతున్నారు

-నూకరాజు, మత్స్యకారుడు, నాయకర్‌కాలనీ

వేట నిషేధం అమలు చేస్తున్న తమకు పరిహారం కింద చెల్లించాల్సిన డబ్బులు రాలేదు. ఎందుకు రాలేదని ఆరా తీస్తే చుక్కలు చూపెడుతున్నారు. ఏదో పార్టీలు అంట కట్టి వేలు ముద్రలు పడడంలేదు. ఆధార్‌కార్డు లింక్‌ అవలేదనే సాకులు చెబుతున్నారు. దీంతో తిరగలేక విసుగెత్తిపోతున్నాం. అందరికీ వేట పరిహారం సకాలంలో చెల్లించాలి.

Updated Date - 2022-05-29T07:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising