నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి
ABN, First Publish Date - 2022-09-15T05:37:11+05:30
కాకినాడ సిటీ, సెప్టెంబరు 14: బూతుల మంత్రిగా ఘనతికెక్కిన మాజీ మంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తగిన శాస్తి జరుగుతుందని కాకినాడ పార్లమెంటరీ తెలుగు మహిళాధ్యక్షురాలు సుంకర పావని హెచ్చరించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబసభ్యులపై నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిం
కాకినాడ తెలుగు మహిళాధ్యక్షురాలు సుంకర పావని
కాకినాడ సిటీ, సెప్టెంబరు 14: బూతుల మంత్రిగా ఘనతికెక్కిన మాజీ మంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తగిన శాస్తి జరుగుతుందని కాకినాడ పార్లమెంటరీ తెలుగు మహిళాధ్యక్షురాలు సుంకర పావని హెచ్చరించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబసభ్యులపై నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు భిక్షతో రాజకీయ జీవితం ప్రారంభించి నారా వారి కుటుంబాన్ని నిందించే స్థాయికి నాని దిగజారడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి పదజాలం ఉపయోగించరని మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో జగన్ తీసుకుంటారనే భ్రమల్లో నాని ఉన్నట్లుందన్నారు. నానిని సభ్యసమాజం బహిష్కరించేరోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.
Updated Date - 2022-09-15T05:37:11+05:30 IST