ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబుల్‌ ఎసెస్‌మెంట్ల తొలగింపు

ABN, First Publish Date - 2022-07-06T05:57:26+05:30

కార్పొరేషన్‌, (కాకినాడ), జూలై 5: మేయర్‌ సుంకర శివప్రసన్న అధ్యక్షతన మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన నగరపాలకసంస్థ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో 25ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యకు మోక్షం కలిగింది. ఆస్తిపన్ను, కుళాయిపన్ను, ట్రేడ్‌ లైసెన్సులకు సంబంధించి డబుల్‌ ఎసెస్‌మెంట్లను రికార్డుల నుంచి తొలగిస్తూ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. గడపగడపకు మన

సమావేశంలో మేయర్‌, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ స్టాండింగ్‌ కమిటీలో నిర్ణయం

కార్పొరేషన్‌, (కాకినాడ), జూలై 5: మేయర్‌ సుంకర శివప్రసన్న అధ్యక్షతన మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన నగరపాలకసంస్థ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో 25ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యకు మోక్షం కలిగింది. ఆస్తిపన్ను, కుళాయిపన్ను, ట్రేడ్‌ లైసెన్సులకు సంబంధించి డబుల్‌ ఎసెస్‌మెంట్లను రికార్డుల నుంచి తొలగిస్తూ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పలు ప్రాం తాల్లో పర్యటించిన సందర్భంలో ప్రజలు డబుల్‌ ఎసెస్‌మెంట్ల సమస్యను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 15-20 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను సచివాలయాల వారీగా రికార్డులను పరిశీలించి స్టాండింగ్‌ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా 2683 ఆస్తిపన్నుకు సంబంధించి అపరాధ రుసుముతో రూ.13.34కోట్లు, 1726 నీటిపన్ను అసె్‌సమెంట్‌కు సంబంధించి రూ.1.71 కోట్లు, 529 ఖాళీ స్థలాల పన్నులకు సంబంధించి రూ.8.79 కోట్లు, 3355 ట్రేడ్‌లైసెన్సులకు సంబంధించి రూ.1.34 కోట్లు తేల్చారు. ఈ మొత్తం బకాయిలను స్టాండింగ్‌ కమిటీ ఆమోదం ద్వారా రికార్డుల నుంచి తొలగించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్‌ శివప్రసన్న మాట్లాడుతూ మొత్తం 14 అంశాలను స్టాండింగ్‌ కమిటీలో ఆమోదించామన్నారు. ముఖ్యంగా డబుల్‌ ఎసెస్‌మెంట్‌ సమస్యను కమిటీ ద్వారా పరిష్కరించామన్నారు. అలాగే 5 డివిజన్లలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వంలో తన దృష్టికి వచ్చిన సుమారు రూ.3కోట్ల అభివృద్ధి పనులకు కమిటీలో ఆమోదించామన్నారు. కమిషనర్‌ రమేష్‌ మాట్లాడుతూ సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల అనేక చోట్ల డబుల్‌ అసె్‌సమెంట్లు నమోదయ్యాయని, ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుల దీర్ఘకాల సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ సత్యనారాయణరావు, మేనేజర్‌ కర్రి సత్యనారాయణ, కార్యదర్శి ఏసుబాబు, ఏవో శిరీష, అకౌంటెంట్‌ చక్కా రమణ, ఉద్యాన అధికారి సిరిల్‌, డీఈలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising