ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీజీహెచ్‌లో కొత్త ఓపీ విధానం

ABN, First Publish Date - 2022-02-23T06:22:15+05:30

కాకినాడ జీజీహెచ్‌లో ఓపీ నమోదు విధానంలో మార్పులు తీసుకు రావడం రోగులు, వారి బంధువుల పాలిట శాపంగా మారింది.

రోగుల అవస్థలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోగుల అవస్థలు
జీజీహెచ్‌, ఫిబ్రవరి 22: కాకినాడ జీజీహెచ్‌లో ఓపీ నమోదు విధానంలో మార్పులు తీసుకు రావడం రోగులు, వారి బంధువుల పాలిట శాపంగా మారింది. ఇప్పటివరకు ఓపీ టికెట్‌లో కేవలం పేషెంట్‌ పేరు, చిరునామా, వయస్సు, సంబంధిత ఓపీ పేరు మాత్రమే ఉండేవి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు  ముఖ్యమంత్రి ఫొటోతో ఓ ఓపీ టికెట్‌ ఫార్మెట్‌ను తీసుకువచ్చారు. దీంట్లో ఆధార్‌కార్డు నెంబరు నమోదు, మరికొన్ని వివరాలు అదనంగా పొందుపరచడంతో వాటిని పూరించడం, ఓపీ నమోదు సిబ్బందిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. రోగులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. గంటల తరబడి ఓపీ నమోదు కేంద్రం వద్దే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంటి పిల్లల తల్లుల పరిస్థితి మరీ దారుణం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పని పూర్తికాక వెనుదిరగాల్సి వచ్చిందన్నారు.  ఓపీ టికెట్‌ నూతన విధానాన్ని ప్రతిఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. పాత విధా నాన్నే కొనసాగించాలని కోరుతున్నారు. ఆధార్‌ కార్డు తీసుకురాని వారి పరిస్థితి దారు ణంగా ఉంటుందని పలువురు అం టున్నారు.  దీనిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.వెంకట బుద్దాను వివరణ కోరగా ఆధార్‌కార్డు తీసుకు రాకపోయినా ఓపీ టిక్కెట్‌ ఇవ్వాలని ఆదే శించామన్నారు. అయితే ఆయుష్‌మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ కింద రోగుల వివరాలను డిజిటలైజ్‌ చేయాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా తెలిపారు..

Updated Date - 2022-02-23T06:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising