ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గాలి’కొదిలేశారు..!

ABN, First Publish Date - 2022-06-09T07:00:48+05:30

కాకినాడ నగరం పచ్చదనానికి, ప్రశాంతతకు మారు పేరు. దీన్ని పెన్షనర్స్‌ ప్యారడైజ్‌ అని పిలుస్తారు. అనేకమంది తమ జీవిత చర మాంకంలో ఇక్కడికే వచ్చి స్థిరపడాలని కోరుకుంటారు. కానీ ఇప్పు డు నగరం ఆరోగ్యకరంగా జీవించడానికి అనువుగా లేదు. తీవ్ర వాయు కాలుష్యంతో శ్వాసకోస, చర్మవ్యాధులు చుట్టుముట్టేలా పరి స్థితులు ప్రమాదకరంగా మారాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కాకినాడలో ప్రమాదకరస్థాయికి చేరిన వాయుకాలుష్యం
  • రాష్ట్రంలోనే అత్యధికం.. ప్రజలకు శ్వాసకోస సమస్యల ముప్పు
  • 326.25కు చేరిన ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్‌.. రెడ్‌ కేటగిరీలో నగరం
  • ఏ జిల్లాలో చూసినా ఈ స్థాయిలో లేని వాయుకాలుష్యం ఆనవాళ్లు
  • కాకినాడలో ‘వెరీపూర్‌’గా నిర్ధారించిన కాలుష్య నియంత్రణ మండలి
  • సీఎం డ్యాష్‌బోర్డులో ప్రత్యక్షమైన నివేదిక వివరాలు
  • నగరం చుట్టూ చమురు, ఎరువులు, పోర్టులు ఇతర పరిశ్రమలతో భారీగా పెరుగుతున్న కాలుష్య తీవ్రత
  • అనేక పరిశ్రమలు అర్ధరాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా వాయువులు విడుదల 8 వాసన పీల్చలేక ఇప్పటికే జనం ఇబ్బందులు

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

కాకినాడ నగరం పచ్చదనానికి, ప్రశాంతతకు మారు పేరు. దీన్ని పెన్షనర్స్‌ ప్యారడైజ్‌ అని పిలుస్తారు. అనేకమంది తమ జీవిత చర మాంకంలో ఇక్కడికే వచ్చి స్థిరపడాలని కోరుకుంటారు. కానీ ఇప్పు డు నగరం ఆరోగ్యకరంగా జీవించడానికి అనువుగా లేదు.  తీవ్ర వాయు కాలుష్యంతో శ్వాసకోస, చర్మవ్యాధులు చుట్టుముట్టేలా పరి స్థితులు ప్రమాదకరంగా మారాయి. నగరం చుట్టూ అనేక రసా యన, చమురు రిఫైనరీలు, ఎరువుల పరిశ్రమలు, పోర్టులు ఉండ డంతో విపరీతమైన వాయుకాలుష్యం కాకినాడను ఆవహిస్తోంది. దీంతో గాలి నాణ్యత అత్యంత నాసిరకంగా మారింది. ఇదే విషయా న్ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా నిర్ధారించింది. రా ష్ట్రంలోనే కాకినాడ నగరాన్ని రెడ్‌ కేటగిరీలో చేర్చింది. ఇక్కడ గాలి నాణ్యత సూచిక ప్రమాదంలో పడింది. ఏకంగా 326.25 పాయింట్ల కు చేరింది. దీంతో పీల్చేగాలి నాణ్యత ‘వెరీపూర్‌’గా తేల్చారు. దీని వల్ల ప్రజలు ఈ గాల్చి పీల్చితే రకరకాల అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పీల్చితే మటాష్‌...

కాకినాడ నగర జనాభా ఐదు లక్షలపైనే. రాష్ట్రంలో అత్యంత ప్రశాంత నగరంగా దీనికి పేరు. ఇప్పుడు ఇక్కడ నివసించడం ము న్ముందు ఆరోగ్యంతో చెలగాటమే అన్నట్లు పరిస్థితులు ప్రమాద కరంగా మారుతున్నాయి. పీల్చే గాలి విషతుల్యమై జబ్బుల బారిన పడేలా వాయుకాలుష్యం రానురాను పెరిగిపోతోంది. దీంతో శ్వాస కోస సమస్యలు క్రమేపీ పెరగనున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. అటు చర్మవ్యాధులు కూడా పెరగనున్నాయి. దీనికంతటికీ ప్రధాన కారణం నగరంలో పీల్చేగాలి కలుషితం కావడమే. ఇదే విషయాన్ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదించింది. రాష్ట్రంలోనే కాకి నాడ నగరంలో వాయుకాలుష్యం అత్యంత తీవ్రంగా ఉన్నట్లు గుర్తిం చింది. ఇక్కడ పీల్చేగాలి ‘వెరీపూర్‌’ అని నిర్ధారించింది. గాలి నాణ్య తను సూచించే ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ) ఇక్కడ ప్రమాద కరంగా ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో దాదాపు అన్ని నగరాల్లో ఇది వందలోపే ఉండగా కాకినాడలో సరాసరి 326.25గా ఉంది. అంటే డేంజర్‌ విభాగం అని అర్థం. అంటే ఇక్కడ పీల్చేగాలి చాలా ప్రమా దకరమని అర్థం. ఇదే విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సీఎం డ్యాష్‌బోర్డులో పేర్కొన్నారు. దీన్నిబట్టి కాకినాడ లో పీల్చేగాలి ఏస్థాయిలో విషతుల్యమైందో అర్థం చేసుకోవచ్చు. ప్రాంతాలవారీగా కాలుష్య తీవ్రతను చూస్తే కళ్లు తేలేయాల్సిందే.

ప్రమాదకరంగా గాలి నాణ్యత

రమణయ్యపేటలోని కాలుష్య నియంత్రణబోర్డు కార్యాలయం పరిసరాల్లోని గాలి నాణ్య త నిర్ధారించే స్టేషన్‌ పరి ధిలో ఏక్యూఐ స్థాయి 571గా ఉంది. అంటే ఆరో గ్యవంతులు కూడా ఇక్కడి పరిసరాల్లో గాలిని పీల్చితే రకరకాల జబ్బుల బారిన పడతారని వైద్యులు చెబు తున్నారు. ఇప్పటికే పలు వ్యాధుల బారిన పడ్డవారి పరిస్థితి మరింత విషమి స్తుందని పేర్కొన్నారు. లైట్‌హౌస్‌కు సమీపంలోని సూర్యారావుపేట స్టేషన్‌ పరిధిలో గాలి నాణ్యత మరీ ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ ఏక్యూఐ ఇండెక్స్‌ ఏ కంగా 618గా నమోదైంది. అంటే ఈ పరిసరాల్లో నివసించే వారు రకరకాల వ్యాధుల బారిన పడను న్నారు. వాస్తవానికి నగరాన్ని ఆనుకుని ప్రముఖ కంపెనీలకు చెందిన వంటనూనెల తయారీ, శుద్ధి చేసే రిఫైనరీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వందల ఎకరాల్లో కోరమండల్‌, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ ఎరువుల కర్మా గారాలు, ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీ, రెండు పోర్టులు పని చేస్తున్నాయి. ఇవికాకుండా చిన్నాచితకా పరిశ్రమలు వందల్లో ఉన్నాయి. దీంతో విపరీతంగా వాయుకాలు ష్యం నగరాన్ని ఆవహిస్తోంది. మరోపక్క నగరాన్ని ఆనుకుని ఉన్న అనేక కంపెనీలు అర్ధరాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యర్థ వాయువులను గాల్లోకి వదులుతున్నాయి. వీటిని పీల్చితే కడుపులో వికారం, వాంతులు, శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రాత్రి 12గంటల తర్వాత రసాయనాల గాఢతతో భానుగుడి జంక్షన్‌నుంచి లైట్‌హౌస్‌ పరిధిలోని ప్రజలయితే గాలి పీల్చలేక చాలా ఇబ్బందులకు గుర వుతున్నారు. ఇళ్లకు గడియపెట్టి బిక్కుబిక్కుమంటున్నారు. పిల్లలు, వృద్ధులున్న నివాసాల్లో భయాందోళనలకు గురవుతున్నారు. అయి నా అధికారులు కనీసం చర్యలు తీసుకోవడం లేదు. తనిఖీలు చేప ట్టి పరిస్థితిని నియంత్రించేలా చేయడంలో విఫలమవుతున్నారు. రోజువారీ నివేదికలు పరిశీలించి జరిమానాతోపాటు గాలి నాణ్యత పెరిగేలా చేయడాన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యంత ప్రమాదకరంగా వాయు కాలుష్యం కాకినాడలో పెరగడానికి కారణమై ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.

కాలుష్య నియంత్రణ బోర్డు సాంకేతిక లెక్కల ప్రకారం 

ఏక్యూఐ గాలి నాణ్యత 

0-50 చాలా బాగుంది

51-100 సంతృప్తికరం

101-200 మోడరేట్‌

201-300 పూర్‌

301-400 వెరీ పూర్‌ 

Updated Date - 2022-06-09T07:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising