‘కాజులూరును కాకినాడలో చేర్చాలి’
ABN, First Publish Date - 2022-01-30T07:03:13+05:30
కాజులూరు మండలాన్ని కాకినాడ జిల్లాలో చేర్చాలంటూ జేఏసీ మండల నాయకులు డిమాండ్ చేశారు.
కాజులూరు, జనవరి 29: కాజులూరు మండలాన్ని కాకినాడ జిల్లాలో చేర్చాలంటూ జేఏసీ మండల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు పార్టీలకతీతంగా జేఏసీగా ఏర్పడ్డారు. ఈసందర్భంగా ఆయాపార్టీల నాయకులు మాట్లాడుతూ 70కిలోమీటర్ల దూరంలో ఉన్న అమలాపురం జిల్లా నుంచి కాజులూరు మండలాన్ని తొలగించి కాకినాడ జిల్లాలో చేర్చాలన్న న్యాయవాది జల్లి సత్యనారాయణ, మాధవరపు నానాజీ, మాజీ జడ్పీటీసీ యాళ్ల సూర్యప్రకాష్, పోతురాజు భీమారావు, డి.జయప్రకాష్, పీఎంపీ అసోసియేషన్ అధ్య క్షుడు జేవీవీ సూర్యనారాయణమూర్తి, యాళ్ల బాబు, పోతుల వీరబాబు, పి.జ్యోతికుమార్, శివ పాల్గొన్నారు. కాజులూరు మండలాన్ని అమలాపురం జిల్లాలో కొనసాగిస్తే మండల ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటారని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు అన్నారు. కాజులూరు మండల పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడారు. కాకినాడకు చేరువగా ఉండే కాజులూరు మండల ప్రజలు చాలా కుటుంబాలు కాకినాడలో స్థిరపడి ప్రత్యేక అనుబంధంకలిగి ఉన్నారని తెలిపారు.
Updated Date - 2022-01-30T07:03:13+05:30 IST