ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జె.తిమ్మాపురంలో చేపల చెరువుల తవ్వకాల నిలుపుదల

ABN, First Publish Date - 2022-05-26T05:55:21+05:30

పెద్దాపురం, మే 25: మండల పరిధిలోని జె.తిమ్మాపురంలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా తవ్వకాలు సాగిస్తున్న చేపల చెరువులపై అధికారులు బుధవారం తనిఖీల నిర్వహించారు. ఈనెల 25న ఆంధ్రజ్యోతి దినపత్రికలో అంతా మాఇష్టం పేరుతో ప్రచురితమైన కథనానికి జిల్లా జాయిం

జె.తిమ్మాపురంలో తవ్వకాలను పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విచారణకు ఆదేశించిన జేసీ ఇలాక్కియా 

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన 

పెద్దాపురం, మే 25: మండల పరిధిలోని జె.తిమ్మాపురంలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా తవ్వకాలు సాగిస్తున్న చేపల చెరువులపై అధికారులు బుధవారం తనిఖీల నిర్వహించారు. ఈనెల 25న ఆంధ్రజ్యోతి దినపత్రికలో అంతా మాఇష్టం పేరుతో ప్రచురితమైన కథనానికి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇలాక్కియా స్పందించారు. దీనిపై విచారణ చేయాలని, అనధికార చేపల చెరువుల తవ్వకాల పనును నిలిపివేయాలని మత్స్య శాఖ జేడీ ఆదేశించారు. దీంతో మత్స్యశాఖ డీడీ తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్‌డీవో కె.ప్రకాశరావు, స్థానిక పంచాయతీ కార్యదర్శి సుభానీ, వీఆర్వో శ్రీనివా్‌సతో కలిసి తవ్వకాల ప్రదేశంలో తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేకు ండా తవ్వకాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. తవ్వకందార్లకు అపరాధ రుసుము విధిస్తామని ఎప్‌డీవో తెలిపారు. అలాగే తవ్వకందార్ల నుంచి లికితపూర్వకంగా లెటర్లు తీసుకున్నామని, సమీప రైతుల నుంచి కూడా సమ్మతి తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన తరువాత మాత్రమే తవ్వకాలు సాగించాలని, నిబంధనలకు విరుద్దంగా సాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు వచ్చేవరకూ తవ్వకాలను నిలిపివేసినట్టు ఎఫ్‌డీవో తెలిపారు. 

Updated Date - 2022-05-26T05:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising