జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర
ABN, First Publish Date - 2022-12-31T23:25:07+05:30
యువతను ప్ర త్యక్షంగా కలిసివారి సాధక, బాధకాలు తెలుసు కునేందుకు యువగళం పేరుతో రాష్ట్రంలో జనవ రి 27నుంచి నారా లోకేష్ పాదయాత్ర చేపడుతు న్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు.
కాకినాడ సిటీ, డిసెంబరు 31:యువతను ప్ర త్యక్షంగా కలిసివారి సాధక, బాధకాలు తెలుసు కునేందుకు యువగళం పేరుతో రాష్ట్రంలో జనవ రి 27నుంచి నారా లోకేష్ పాదయాత్ర చేపడుతు న్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణు లతో కలిసి ఆయన శనివారం మీడియా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను ముందుకు తీసుకెళ్లే ందుకు టీడీపీ కృషి చేసిందన్నారు. నాటి టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షు డు మల్లిపూడి వీరు, నాయకులు వాసిరెడ్డి ఏసు దాసు, నృశింహదేవర విశ్వనాధం, కొల్లాబత్తుల అప్పారావు, తుమ్మల రమేష్, వొమ్మి బాలాజీ పాల్గొన్నారు. అలాగే కందుకూరు సభలో ప్రమా దశాత్తూ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను దూరంగా ఉంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే వనమా డి కొండబాబు వెల్లడించారు.
Updated Date - 2022-12-31T23:25:09+05:30 IST