ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటల బీమాలో అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందే!

ABN, First Publish Date - 2022-06-28T06:01:18+05:30

పంటల బీమా చెల్లింపుల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు చేతివాటం ప్రదర్శించి నిజమైన రైతులకు రావాలసిన మొత్తాలను బినామీ పేర్లతో కాజేశారని జనసేన నాయకులు ఆరోపించారు. ఆలమూరు మండలంలో జరిగిన అక్రమాలు రోజుకొక రకంగా బయటపడుతున్నాయని, వీటిపై నిగ్గు తేల్చాలని జనసేన కొత్తపేట నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసైనికులు సోమవారం ఆలమూరులో కదంతొక్కారు.

ఆలమూరులో ప్రదర్శన నిర్వహిస్తున్న జన సైనికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జనసేన కొత్తపేట నియోజకవర్గ ఇనచార్జి బండారు శ్రీనివాసరావు డిమాండ్‌

ఆలమూరు, జూన్‌ 27: పంటల బీమా చెల్లింపుల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు చేతివాటం ప్రదర్శించి నిజమైన రైతులకు రావాలసిన మొత్తాలను బినామీ పేర్లతో కాజేశారని జనసేన నాయకులు ఆరోపించారు. ఆలమూరు మండలంలో జరిగిన అక్రమాలు రోజుకొక రకంగా బయటపడుతున్నాయని, వీటిపై నిగ్గు తేల్చాలని జనసేన కొత్తపేట నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసైనికులు సోమవారం ఆలమూరులో కదంతొక్కారు. తొలుత టౌన్‌ హాలులో సమావేశమయ్యారు. అనంతరం ర్యాలీగా తరలివెళ్లి తహశీల్దార్‌ లక్ష్మీపతి, ఎంపీడీవో ఝాన్సీ, వ్యవసాయ శాఖ సహాయ సంచాల కుడు సీహెచకేవీ చౌదరిలకు వినతిపత్రాలు అందించారు. నిజమైన రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని తేల్చి చెప్పారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని బినామీదారుల వద్ద నుంచి సొమ్ము వాపసు తీసుకుని నిజమైన రైతులకు అందించాలని కోరారు. నాయకులు సంగిత సుభాష్‌, సూరపురెడ్డి సత్య, గారపాటి త్రిమూర్తులు, తాళ్ల డేవిడ్‌, బైరిశెట్టి రాంబాబు, కొత్తపల్లి నగేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T06:01:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising