ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2024లో అధికారంలోకి జనసేన పార్టీ

ABN, First Publish Date - 2022-08-04T06:59:06+05:30

రాష్ట్రంలో 2024లో జనసేన పార్టీయే అధికారంలోకి వస్తుందని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలికిపురం, ఆగస్టు 3: రాష్ట్రంలో 2024లో జనసేన పార్టీయే అధికారంలోకి వస్తుందని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ అన్నారు. శం కరగుప్తంలో జరిగిన జనసేన సమావేశంలో ఆయన మాట్లా డుతూ క్రియాశీలక సభ్యత్వానికి రూ.500చెల్లిస్తే మరో రూ.1500 పవన్‌కల్యాణ్‌  సొంత నిధులను కేటాయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల కోసం సొంతంగా రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్న నాయకులు పవన్‌ అని అన్నారు. వైసీపీ పాలన ప్రజా వ్యతిరేకంగా నడుస్తుందని, నవరత్నాల పేరుతో కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. రాజోలులో జనసేన పార్టీ నుంచి నెగ్గిన ఎమ్మెల్యే ప్రక్క పార్టీకి వెళ్లినప్పటికీ రాజో లులో కార్యకర్తలు పార్టీని మరింత ముందుకు తీసుకు వెళా ్లరని అన్నారు. కార్యకర్తలకు క్రియాశీలక కిట్లను అందించారు. కార్యక్రమంలో పితాని బాలకృష్ణ, డీఎంఆర్‌ శేఖర్‌, ఎస్‌ వెంక టేశ్వరరావు, తాడి మోహన్‌, దిరిశాల బాలాజీ, గెడ్డం మహా లక్ష్మిప్రసాద్‌, గుండుబోగుల పెద్దకాపు, మల్లిపూడి  సత్తిబాబు, గుబ్బల రవికిరణ్‌, గుబ్బల ఫణికుమార్‌, ఎంపీపీ ఎంవీ సత్యవాణి  పాల్గొన్నారు. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  పితృవియోగంతో బాధపడుతున్న బట్టేలంకకు చెందిన బండారు విజయ్‌ కుమార్‌ను కందుల దుర్గేష్‌, పితాని బాల కృష్ణ, అడబాల తాతకాపు, ముత్యాల బాలాజీ తదితరులు పరామర్శించారు. 



Updated Date - 2022-08-04T06:59:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising