ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక్కడే.. ఇత్తడి

ABN, First Publish Date - 2022-08-06T06:15:50+05:30

ఎక్కడో మారు మూల ఊరు.. సరైనా రవాణా సౌకర్యం కూడా ఉండదు.. బస్‌ సౌకర్యం కూడా లేదు..కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఊరు పేరు కంచు మోగినట్టు మారుమ్రో గుతూనే ఉం టుంది..

ఇత్తడి వస్తువుల దిగుమతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజ్జరంలో వందేళ్లగా వ్యాపారం

గ్రామమంతా ఇత్తడి దుకాణాలే

రవాణాలేని గ్రామంలో 50 షాపులు

80 శాతం ఇతర వస్తువుల దిగుమతి

స్థానికంగా 20 శాతం వస్తువులే తయారి

నేడు ఇత్తడి వస్తువులన్నీ అలంకారమే

కోట్లలో లావాదేవీలు

పలు రాష్ర్టాల్లో ప్రసిద్ధి

రోజురోజుకు తగ్గుతున్న కార్మికులు


పెరవలి, ఆగస్టు 5 : ఎక్కడో మారు మూల ఊరు.. సరైనా రవాణా సౌకర్యం కూడా ఉండదు.. బస్‌ సౌకర్యం కూడా లేదు..కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఊరు పేరు కంచు మోగినట్టు మారుమ్రో గుతూనే ఉం టుంది.. ఎవరైనా ఆ ఊరులోకి అడుగుపెట్టారా కళ్లు జిగేల్‌..జిగేల్‌మంటాయి.. ఒక్కసారి ఆగారా కదలడం కష్టమే.. ఆ ఊరులో తయారు చేసే వస్తువులు అంతలా కట్టిపడేస్తాయి..ఇంతకీ ఆ ఊరులో తయారయ్యే వస్తు వులేమిటంటారా.. ప్రస్తుతం మన జిల్లాలోని పెరవలి మం డలం అజ్జరం ఇత్తడి వస్తువుల కేరాఫ్‌ అడ్రస్‌.. నిత్యం వంద లాది మంది ఆ ఊరుకు ప్రత్యేకంగా వెళతారు. 


నాడు.. నేడూ అలంకారమే..


ఇత్తడి పరిశ్రమకు రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధిగాంచిన అజ్జరంలో ప్రస్తుతం మెరుగులు తగ్గాయి. పూర్వ నుంచి ప్రతి ఇంటిలోనూ బంగారం, వెండి వస్తువులతో పాటు అంతే ప్రాధాన్యత ఇస్తూ ఇత్తడిని ఉంచే వారు.అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్దసాల్తీలు నుంచి చిన్న సాల్తీలు వరకు ఇళ్లల్లో అలం కారంగా అమర్చుకునేవారు. పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్లే సమయంలో కట్న కానులతో పాటు ఇత్తడి వస్తువులను తీసుకెళ్లేవారు. పెద్ద పెద్ద గుండుగులు, డేగిచాలు, బిందెలు, కళాగిన్నెలు, బకెట్లు, ఇత్తడి మర చెంబులు, ఇత్తడి గ్లాసులు, ఇత్తడి పల్లాలు వంటి వాటికి ఎంతో ప్రాఽధాన్యత ఇచ్చేవారు. కాలక్రమేణా ఈ వస్తువులు తగ్గిస్తూ వచ్చారు. అవసరం మేరకు మాత్రమే ఉంచుకుని మిగిలిన వస్తువులను పాత ఇత్తడి సామగ్రి క్రింద విక్రయిస్తున్నారు. గతంలో ఈ వస్తువులన్నీ అజ్జరంలోనే తయారుచేసేవారు. ప్రస్తు తం ఈ వస్తువులను వినియోగించేవారే కరువ య్యారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు రూటు మార్చా రు. ప్రస్తుతం ఇస్ర్టీపెట్టెలు, బిందెలు, బకెట్లు, పాలవెల్లి తదితర చిన్న చిన్న వస్తువులు తయారు చేస్తున్నారు. ఇక అజ్జరం గంటకు అంతా ఇంతా ప్రసిద్ధి కాదు. ఆంధ్ర,తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ర్టాల్లోని ఆలయాలకు ఇక్కడి నుంచే సరఫరా చేస్తు న్నారు. కొత్తగా ఆలయం కట్టారంటే అందులో  గం టకు అజ్జరంను సంప్రదించాల్సిందే. ఇక్కడ తయారైన గంటకు అంత ప్రాముఖ్యత మరి. కొత్త ఇత్తడి తూ కాన్ని బట్టి రూ.650  నుంచి రూ.850 వరకు ఉంది. పాత ఇత్తడి రూ.450లకు కొనుగోలు చేస్తున్నారు. 


స్థానికంగా తగ్గిన తయారి..


మారిన పరిస్థితుల వల్ల చాలా వరకు వస్తువులు అజ్జరంలో తయారు కావడం లేదు. ప్రజలు ఎక్కువుగా వినియోగించే బిందెలు, బక్కెట్లు, వంట సామగ్రి వం టివి మాత్రమే ప్రస్తుతం తయారు చేస్తున్నారు. వీటికి డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉన్నందువల్ల ఇక్కడ పని చేసేవారు కూడా  బాగా తగ్గిపోయారు. అజ్జరాన్ని కేంద్రంగా చేసుకుని వెంకట్రాయపురం, తీపర్రు, పెరవలి గ్రామాల్లో  ఇత్తడి వస్తువులు తయారుచేస్తుంటారు. గతంలో సుమారు 300 మంది వరకు ఇత్తడి పనులు చేసే వారు ఉండగా ప్రస్తుతం వంద లోపు మాత్రమే ఇత్తడి పనివారు మిగిలారు.


కళాత్మక వస్తువుల దిగుమతి..


ఇత్తడిలో ప్రస్తుతం అలంకార వస్తువులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటిలో అందంగా అమర్చుకునేలా పూల కుండీలు, దేవుడి విగ్రహాలు, వివిధ రకాల ఆకృతులతో కూడిన వస్తువులు ఇళ్లలో ఉంచుకుంటున్నారు. బుద్దుడు, రాధాకృష్ణులు, శివ పార్వతులు వంటి విగ్రహాలతో పాటు ఇంకా చాలా రకాల వస్తువులను ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, చెన్నై వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని  వ్యాపా రం చేస్తున్నారు.ఇటువంటి వస్తువులు అజ్జరంలో తయా రు కాకపోవడంతో ఇక్కడి వ్యాపారులు ఇతర పారంతాల నుంచి వాటిని దిగుమతి చేసుకుంటున్నారు. 


 20 శాతమే ఇక్కడ తయారి..

ప్రస్తుతం విక్రయించే సరుకుల్లో  20 శాతం మాత్రమే ఇక్కడ తయారవుతున్నాయి. మిగిలిన వస్తువులన్ని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ వస్తువులు ఇక్కడ తయారయ్యేలా ప్రభుత్వం పోత్సహి స్తే ఇక్కడి పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుంది. పూర్వీకుల కష్టం ఫలిస్తుంది.  

- సబ్బెళ్ళ శ్రీనివాసరెడ్డి, వ్యాపారి, అజ్జరం


అలంకార వస్తువులకే డిమాండ్‌

మారిన పరిస్థితులను బట్టి తాము కూడా వస్తువులను విక్రయించాల్సి వస్తుంది. పూర్వం గుండుగులు, బిందెలు వంటి వాటికి ఎక్కువ డిమాండ్‌ ఉండేది. ప్రస్తుతం ఇంటిలో అలంకార వస్తువులకు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడింది. ఆ వస్తువులనే దిగుమతి చేసుకుని వ్యాపారం చేస్తున్నారు.  

-  సత్తి భాస్కరరెడ్డి, అజ్జరం, వ్యాపారి


Updated Date - 2022-08-06T06:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising