ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2022-01-20T05:14:38+05:30

రౌతులపూడి, జనవరి 19: గిరిజనుల సమస్యలు పరిష్కారించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య హెచ్చరించారు. బుధవారం సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ గ్రామాలు జల్దాం, రాఘవపట్నంలో ఆయన పర్యటించారు. గిరిజన ప్రజలు సమస్యలు అడిగి

జల్దాంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న పీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి 

ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య 

రౌతులపూడి, జనవరి 19: గిరిజనుల సమస్యలు పరిష్కారించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య హెచ్చరించారు. బుధవారం సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ గ్రామాలు జల్దాం, రాఘవపట్నంలో ఆయన పర్యటించారు. గిరిజన ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ సర్టిఫికెట్‌ కోసం దళారులకు రూ.3వేలు ఇస్తున్నట్టు పీవో దృష్టికి తీసుకువచ్చారు. దళారులను నమ్మవద్దని, అధికారులు దగ్గరకు వెళ్లాలని సూచించారు. సచివాలయాన్ని తనిఖీ చేసి సిబ్బంది అందుబాటులో ఉండా లని సూచించారు. గొర్రెలు, మేకల మృతిపై వెటర్నరీ సిబ్బందిని పీవో ప్రశ్నించారు. పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పశువైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామసభలు పెట్టి సమస్యలు పరిష్కారించాలన్నారు. గిరిజన సమస్యలను వారంలో పరిష్కరించకపోతే నేరుగా తన దగ్గరకు రావాలన్నారు. ఆరోవోఎ్‌సఆర్‌ పట్టాలపై తహశీల్దార్‌ను వివరాలు అడగగా సమగ్ర సమాచారం ఇవ్వకపోవడంతో పూర్తి వివరాల తో రంపచోడవరం కార్యాలయానికి శనివారం రావాలని ఆదేశించారు. అంగన్‌వాడీ, నర్సింగ్‌ సిబ్బంది సక్రమం గా విధులు నిర్వర్తించాలన్నారు. సెల్‌సిగ్నల్‌ లేక సమాచార లోపంతో ఇబ్బందులు పడుతున్నామని పీవోకు గిరిజనులు తెలపగా 6నెలల్లో ప్రతి గిరిజన గ్రామానికి ఎయిటెల్‌ టవర్లు వేస్తున్నట్టు తెలిపారు. పారిశుధ్యం అధ్వానంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసి అధికారుల తీరుపై మండిపడ్డారు. మళ్లీ వారం రోజుల్లో వస్తానని సమస్యలన్నీ పరిష్కారించాలని పీవో తెలిపారు.

Updated Date - 2022-01-20T05:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising