రంపచోడవరం ఐటీడీఏ పీవోగా నిషాంతి
ABN, First Publish Date - 2022-04-04T06:18:06+05:30
పాడేరు గిరిజన జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా తమిళనాడుకు చెందిన టి.నిషాంతిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది.
-పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ప్రవీణ్ ఆదిత్య బదిలీ
రంపచోడవరం,
ఏప్రిల్ 3: పాడేరు గిరిజన జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా
తమిళనాడుకు చెందిన టి.నిషాంతిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం బదిలీ
ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటివరకు పీవోగా ఉన్న ప్రవీణ్ ఆదిత్యను
పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా బదిలీ చేశారు. నిషాంతి అనంతపురం
జాయింట్ కలెక్టర్(హౌసింగ్)గా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వస్తున్నారు.
ఒకటి రెండు రోజుల్లో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఇకపై
రంపచోడవరం ఐటీడీఏ చైర్మన్‌గా పాడేరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్
వ్యవహరించనున్నారు.
Updated Date - 2022-04-04T06:18:06+05:30 IST