ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాభివృద్ధికి కాంగ్రెస్‌ నాయకుల కృషి మరువరానిది

ABN, First Publish Date - 2022-08-10T06:48:23+05:30

దేశాభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేసిన కృషి మరువరానిదని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చిలుకోటి పాండురంగారావు పేర్కొన్నారు.

ప్రతిపాడులోని అల్లూరి సీతారామరాజు సెంటర్‌కు చేరుకున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకుల పాదయాత్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పాండురంగారావు

75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రత్తిపాడులో పాదయాత్ర

ప్రత్తిపాడు, ఆగస్టు 9: దేశాభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేసిన కృషి మరువరానిదని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చిలుకోటి పాండురంగారావు పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు మంగళవారం ప్రత్తిపాడులో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జాతీయ పతాకాలు, కాంగ్రెస్‌ పార్టీ జెండాలు చేతబూని పాదయాత్ర నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ఉమ్మిడి వెంకట్రావు, పీసీసీ సభ్యుడు ధర్నాల కోట శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రను పార్టీ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జి మల్లిపూడి రాంబాబు, రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ నురుకుర్తి వెంకట్రావు, కాకినాడ సిటీ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కోలా ప్రసాద్‌వర్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధానులుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు పనిచేసి ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి, విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యమిచ్చి, బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాలంటే కేంద్రంలో కాంగ్రె్‌స ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దంతులూరు రమే్‌షరాజు, యనుముల నరసింహమూర్తి, మొయ్యేటి సూర్యప్రకాశరావు, కొల్లు వీరగణేష్‌, పంపన కోటేశ్వరరావు, నియోజకవర్గ శక్తి కోఆర్డినేటర్‌ ఉమ్మిడి సురేష్‌, ఏలేశ్వరం టౌన్‌ అధ్యక్షుడు దువ్వా రాజా, దాసరి సత్తిబాబు పాల్గొన్నారు.




Updated Date - 2022-08-10T06:48:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising