ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్లక్ష్యంగా వైద్యం చేస్తే చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2022-12-30T00:44:05+05:30

వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా స్ట్టేట్‌ చైర్మన్‌ బీ.ఎస్‌. బాబు సూచించారు.

కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌తో మాట్లాడుతున్న బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, డిసెంబరు 29 : వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా స్ట్టేట్‌ చైర్మన్‌ బీ.ఎస్‌. బాబు సూచించారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులను గురువారం పరిశీలించారు. రోగుల నుంచి వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు అందబాటులో ఉండేలా చూసుకోవాలని డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని ప్రజలు తమకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఆసుపత్రి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. డీసీహెచ్‌ఎస్‌ డా. ఎం.సనత్‌కుమారి మాట్లాడుతూ కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 12 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా ఐదుగురు మాత్రమే ఉన్నారన్నారు.సిబ్బంది తక్కువ ఉండడంతో కడి యం,అనపర్తి ఆసుపత్రుల నుంచి వైద్యులను డిప్యుటేషన్‌పై నియమించామన్నారు. కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లి పూర్తిస్తాయిలో వైద్యుల భర్తీ చేయడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పి.సుభాషిణి, హెడ్‌నర్సు సీహెచ్‌.భాగ్యవతి, బీజేపీ నాయకులు పిక్కి నాగేంద్ర,మురళీకృష్ణ, బోడపాటి ము త్యాలరావు, కొప్పిరెడ్డి రాజబాబు, కొండపల్లి రత్నసాయి, సాయిరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:44:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising