ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవ తప్పిదాలతోనే ప్రకృతి వైపరీత్యాలు

ABN, First Publish Date - 2022-02-12T05:28:37+05:30

మానవ తప్పిదాల కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, దీని వల్లనే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని విజయవాడ ఫైర్‌ డిపార్టుమెంట్‌ డీఎఫ్‌వో శ్రీహరి జగన్నాథ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 11: మానవ తప్పిదాల కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, దీని వల్లనే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని విజయవాడ ఫైర్‌ డిపార్టుమెంట్‌ డీఎఫ్‌వో శ్రీహరి జగన్నాథ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్‌కేవీటీ కళాశాలలో లలిత కళాసమితి ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విపత్తులు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక వేళ సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కొనాలనే విషయాలపై ప్రాథమిక విద్యాస్థాయి నుంచే అవగాహన కల్పించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఎబెల్‌ రాజబాబు మాట్లాడుతూ ఇలాంటి సదస్సులు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ఉపయోగపడతాయన్నారు. కళాశాల తెలుగు విభాగాధిపతి, లలిత కళా సమితి ఉపాధ్యక్షుడు పీవీబీ సంజీవరావు మాట్లాడారు. కార్యక్రమాన్ని విద్యార్థులు నాయుడు, నవీన్‌, ప్రదీప్‌, ఆలీషా పర్యవేక్షించగా, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-12T05:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising