ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహనిర్మాణాల లక్ష్యాల్లో వెనుకబడితే చర్యలు : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-07-07T07:37:27+05:30

జిల్లాలో గృహనిర్మాణాల లక్ష్యాలను వేగవంతం చేయాలి. ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలత హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, జూలై6: జిల్లాలో గృహనిర్మాణాల లక్ష్యాలను వేగవంతం చేయాలి. ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని కలెక్టర్‌ డాక్టర్‌ మాధవీలత హెచ్చరించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి హౌసింగ్‌ గ్రౌండింగ్‌ అంశంపై అధికారులతో కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రంగంపేట, రాజానగరం, బిక్కవోలు, రాజమహేంద్రవరం రూరల్‌ ప్రాంతాలు మాత్రమే వారాంతపు లక్ష్యాన్ని సాధించారని, మిగిలిన మండలాలు రెండ్రోజుల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో వెనుకబడితే చర్య లు తప్పవన్నారు. క్రిటికల్‌ గ్యాప్‌ ఉన్నచోట్ల అప్రోచ్‌ రోడ్డుకూడా నిర్మించడం జరిగిందని చెప్పారు. ఇసుక, సిమెంట్‌, ఐరన్‌ అందుబాటులో ఉన్న లక్ష్యసాధనలో ఎందుకు ప్రగ తి సాధించలేదని ప్రశ్నించారు. కొవ్వూరు, రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్‌ అధికారులు ప్రతిరోజు గృహనిర్మాణాలపై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ మండల స్ధాయిలో హౌసింగ్‌ ,ఎంపిడివో , తహశీల్దార్లతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు అవగాహన పెంచాలన్నారు. ఇప్ప టికే నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌, కొవ్వూరు, నిడదవోలు వెనుకబడి ఉన్నాయని, నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Updated Date - 2022-07-07T07:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising