ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-06-25T07:07:22+05:30

ప్రభుత్వ ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులందరూ గృహాల నిర్మాణాలు వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు.

నిడదవోలులో ఇళ్ల స్థలాల వద్ద మ్యాప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ మాధవీలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జిల్లా కలెక్టర్‌ మాధవీలత
  • పెరవలి, నిడదవోలులో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల పరిశీలన 

పెరవలి,  జూన్‌ 24: ప్రభుత్వ ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులందరూ గృహాల నిర్మాణాలు వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. మండలంలోని అన్నవరప్పాడు, తీపర్రు, కానూరులో ఇళ్ల కాలనీలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించని వారు వెంటనే ప్రారంభించాలని, ఇప్పటికే ప్రారంభించిన వారు త్వరగా పూర్తి చేయాలన్నారు. అన్నవరప్పాడులో 63 గృహాలకు ఆరు ఇళ్లు పూర్తి కాగా, 11 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. తీపర్రులో 29 గృహాలకు 9 పూర్తి కాగా 20 వివిధ దశల్లో ఉన్నాయి. కానూరులో 218 గృహాలకు 2 పూర్తి కాగా 50 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ లబ్ధిదారులంతా కూడా ప్రభుత్వ సాయాన్ని విని యోగించుకొని వెంటనే ఇళ్లు పూర్తి చేయాలన్నారు. స్వయం సహాయక సం ఘాలు ద్వారా రూ. 35 వేలు, డ్వాక్రా సంఘాల ద్వారా మరో రూ.50 వేలు రుణం పొంది వినియోగించుకోవాలని కోరారు. అలాగే జాతీయ రహదారి పక్కన చెత్త వేయడాన్ని పరిశీలించి శుభ్రం చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో శానిటేషన్‌ చేయడంతోపాటు వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తీపర్రులో సచివాలయాన్ని సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు, ఏఈ లక్ష్మీనారాయణ తహశీల్దార్‌ కనకదుర్గ, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీపీ కార్చర్ల ప్రకాష్‌, వైసీపీ మండలాధ్యక్షుడు వీరమల్లు సత్యనారాయణ, సర్పంచ్‌ బాలా త్రిపురసుందరి, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజని,  కుందుల భూపతిరావు, ఎంపీటీసీ ర్యాలీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

నిడదవోలు: నిడదవోలులోని జగనన్న లేఅవుట్ల ఇళ్ల స్థలాలను కలెక్టర్‌ మాధవీలత పరిశీలించారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకునేలా అధికా రులు కృషి చేయాలని, లేఅవుట్లలో సదుపాయాలు కల్పించాలన్నారు. అనంత రం లే అవుట్‌కు సంబంధించి అప్రోచ్‌ రహదారి భూసేకరణపై వారితో చర్చిం చారు. ఆమె వెంట ఆర్డీవో మల్లిబాబు, తహశీల్దార్‌ ఎం.గంగరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ కేవీ పద్మావతి, మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ, హౌసింగ్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - 2022-06-25T07:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising