ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోంగార్డులు పోలీస్‌శాఖకు వెన్నెముక

ABN, First Publish Date - 2022-12-07T00:35:27+05:30

విధి నిర్వహణలో అంకితాభావంతో పని చేస్తూ పోలీసు శాఖకు వెన్నెముకలా హోంగార్డులు విఽధులు నిర్వహిస్తున్నారని, వారి సేవలు వెలకట్టలేనివని జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ క్రైం, డిసెంబరు 6 : విధి నిర్వహణలో అంకితాభావంతో పని చేస్తూ పోలీసు శాఖకు వెన్నెముకలా హోంగార్డులు విఽధులు నిర్వహిస్తున్నారని, వారి సేవలు వెలకట్టలేనివని జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు పేర్కొన్నారు. హోంగార్డ్సు ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం కాకినాడ జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ హోంగార్డుల కవాతును తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేయాలని, ఎటువంటి క్లిష్టమైన బాధ్యతలు అప్పగించిన సమర్థవంతంగా పని చేసేందుకు ముందుండాలని కోరారు. పోలీసుశాఖ సివిల్‌ కానిస్టేబుల్స్‌ భర్తీలో హోంగార్డులకు ప్రభుత్వం 15 శాతం రిజర్వేషన్‌, 25 శాతం ఏపీఎస్పీ కానిస్టేబుల్స్‌కు రిజర్వేషన్‌ కల్పించిందన్నారు. వయో పరిమితిలో సడలింపు ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు. హోంగార్డులు డిప్యూటేషన్‌పై వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, ఎఫ్‌సీఐ, ఫైర్‌, ఓఎన్‌జీసీ, ఏపీజెన్‌కో, సబ్‌జైలు, రోడ్డు ట్రాన్స్‌పోర్టు, దేవస్థానాల తదితర శాఖల్లో హోంగార్డులు అత్యంత సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారని కితాబిచ్చారు. వీరిలో ఎవరైనా మృతి చెందినా, పదవీవిరమణ చేసిన వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు మిగిలిన వారంతా ఒకరోజు వేతనాన్ని స్వచ్ఛందంగా అందిస్తున్న హోంగార్డుల దాతృత్వం అభినందనీయమన్నారు. 2022లో ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన సీనియర్‌ నేషనల్‌ గ్రాప్లింగ్‌ రెజ్లింగ్‌లో తృతీయ స్థానం సాధించిన ఉమెన్‌ హోంగార్డు జి. పరమేశ్వరిని అభినందించి, ప్రశంసా పత్రం ఎస్పీ అందజేశారు. అనంతరం హోంగార్డు పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి భానుగుడి సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ పి.శ్రీనివాస్‌, ఏఎస్పీ రిజర్వు బి.సత్యనారాయణ, ఎస్‌బీ డీఎస్పీ, పలువురు డీఎస్పీలు, హోంగార్డు ఆర్‌ఐ పి.వెంకటఅప్పారావు, హెడ్‌ క్వార్టర్స్‌ ఆర్‌ఐ వీజీ శ్రీహరిరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:35:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising