ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

600 అడుగుల జెండాతో ర్యాలీ

ABN, First Publish Date - 2022-08-07T06:59:01+05:30

కాకినాడ నగరంలో శనివారం నిర్వహించిన ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులోభాగంగా 600అడుగుల పొడవు జాతీయ జెండాతో 3వేలమందికి పైగా విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధశాఖల అధికారులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

కాకినాడ జడ్పీ సెంటర్‌లో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కాకినాడలో ఆకట్టుకున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ఘర్‌ తిరంగా

కాకినాడ సిటీ, ఆగస్టు 6: కాకినాడ నగరంలో శనివారం నిర్వహించిన ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులోభాగంగా 600అడుగుల పొడవు జాతీయ జెండాతో 3వేలమందికి పైగా విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధశాఖల అధికారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా మార్గనిర్దేశనంతో ప్రణాళికాయుతంగా రెవెన్యూ, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, పోలీస్‌, మున్సిపల్‌ శాఖల అధికారుల సమ న్వయంతో ర్యాలీ విజయవంతమైంది. కాకినాడ టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌వద్ద ర్యాలీని జేసీ ఎస్‌.ఇలాక్కియ, కాకినాడ ఆర్‌డీవో బీవీ రమణ, నగర మేయర్‌ సుంకర శివప్రసన్న, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కార్పొరేషన్‌ అద నపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, డీఈవో డి.సు భద్ర, ప్రోగ్రామ్‌ నోడల్‌ అధికారి డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి తదితరులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ మశీ దు సెంటర్‌, జీజీహెచ్‌ మీదుగా సాగి జడ్పీ సెంటర్‌ పీఆర్‌ సర్కిల్‌ వద్ద ముగిసింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామ రాజు తదితరుల వేషధారణలో చిన్నారులు ర్యాలీకి ఆకర్షణ గా నిలిచారు. కార్యక్రమ సమన్వయకర్త ఎన్‌సీఎస్‌ మూర్తి చక్కని వ్యాఖ్యానం ర్యాలీని ఆకట్టుకుంది. వందే మాతరం, భారత్‌ మాతాకీ జై వంటి నినాదాలు ర్యాలీలో హోరెత్తాయి. ఈ సందర్భంగా జేసీ ఇలాక్కియ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశభక్తిని చాటిచెప్పేలా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకునేందుకు వీలు కల్పించే ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంద ని పేర్కొన్నారు.

ముగింపు కార్యక్రమంలో..

జడ్పీ సెంటర్‌ పీఆర్‌ సర్కిల్‌ వద్ద ర్యాలీ ముగింపు కార్య క్రమంలో మేయర్‌ శివప్రసన్న మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈనెల 15 వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఎందరో మహనీయు ల త్యాగాల ఫలితంగా నేడు మనం స్వతంత్ర్యాన్ని అనుభవి స్తున్నామన్నారు. కుడా చైర్‌పర్సన్‌ చంద్రకళాదీప్తి మాట్లాడు తూ దేశంకోసం ఎందరో ప్రాణాలను సైతం త్యాగం చేశార ని, ఆ మహనీయులను ప్రతిఒక్కరూ స్మరించుకోవాల్సిన అ వసరం ఉందన్నారు. కాకినాడ అర్బన్‌, రూరల్‌  తహసీల్దార్‌ వైహెచ్‌ఎస్‌ సతీష్‌, వి.మురారీ, ఎంహెచ్‌వో పృథ్వీచరణ్‌, ఉపాధ్యాయలు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-07T06:59:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising