హ్యాపీ న్యూ ఇయర్
ABN, First Publish Date - 2022-12-31T22:35:39+05:30
ఆంగ్ల నూతన సంవత్సరానికి యువత శనివారం రాత్రి ఉత్సాహంగా స్వా గతం పలికారు. మహిళలు ముం గిట ముగ్గులు వేసి నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. యువత ఆటపాటలతో ఆనందంగా గడిపారు. క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాలు కలగాలని కోరుకున్నారు.
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
స్వీట్లు, పండ్లు, మద్యం దుకాణాల వద్ద సందడి
చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు
చాగల్లు, డిసెంబరు 31: ఆంగ్ల నూతన సంవత్సరానికి యువత శనివారం రాత్రి ఉత్సాహంగా స్వా గతం పలికారు. మహిళలు ముం గిట ముగ్గులు వేసి నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. యువత ఆటపాటలతో ఆనందంగా గడిపారు. క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాలు కలగాలని కోరుకున్నారు. మార్కెట్‌లో స్వీట్లు, పండ్లు, దుకాణాల వద్ద సందడి నెలకొంది. ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులుదీరారు. ఆబాలగోపాలం ఆనందంగా గడిపారు.
కొవ్వూరు కోర్టు ప్రాంగణంలో వేడుకలు
కొవ్వూరు, డిసెంబరు 31: కొవ్వూరు కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీరుకొండ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్వరరావు కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రభావంతో రెండేళ్లు కేసులు పరిష్కారంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కొత్త సంవత్సరంలో ఇబ్బందులను అధిగమించి, అధికసంఖ్యలో కేసులు పరిష్కారం కోసం న్యాయవాదులు స హకరించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.ధర్మారావు, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.బాలాత్రిపుర సుందౄరిదేవి, 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిసే్ట్రట్ కె.శారదాంబ, బార్ కార్యదర్శి పీవీఎన్ మునేశ్వరరావు, న్యాయవాదులు, గుమస్తాలు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
నల్లజర్లలో ముగ్గుల పోటీలు
నల్లజర్ల, డిసెంబరు 31: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నల్లజర్లలో ఎస్‌ఆర్‌కే కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. కళాశాల చైర్మన్ కంఠమణి నారాయణప్రసాద్, సతీమణి వసుంధరదేవి మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయలను కాపాడుకోవాలని, కష్టపడి చదివితే బంగారు భవిష్యత్ ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కండేపు సుబ్రహ్మణ్యం, కిరణ్‌కుమార్, ఎస్‌ఎస్‌ఎన్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T22:35:41+05:30 IST