ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా సత్యదేవుడి వన విహారం

ABN, First Publish Date - 2022-05-16T07:07:43+05:30

సత్యదేవుడి దివ్యకల్యాణోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం వనవిహార మహోత్సవం కనులపండువగా నిర్వహించారు.

నవదంపతులకు వన విహారపూజలు నిర్వహిస్తున్న రుత్విక్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వివాహబడలిక నుంచి సేదతీరిన నవదంపతులు

అన్నవరం, మే 15: సత్యదేవుడి దివ్యకల్యాణోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం వనవిహార మహోత్సవం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు నవదంపతులైన సత్యదేవుడు,అనంతలక్ష్మి అమ్మవారిని, పెండ్లిపెద్దలైన సీతారాములను మేళతాలాలు, వేదమంత్రాలు నడుమ మెట్లమార్గంలో కొండదిగువన ఉద్యానవనానికి తీసుకుని వచ్చారు. అక్కడ మంటపంలో సర్వాంగ సుందరంగా సుగందభరిత పుష్పాలతో అలంకరించిన వేదికపై నవదంపతులను మరో వేదికపై పెండ్లిపెద్దలైన సీతారాములను ఆశీనులు గావించారు. అనంతరం ప్రధానార్చకులు కోట శ్రీను, ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. వివాహబడలికలో ఉన్న నవదంపతులు సేదతీరేందుకు ప్రతీకగా ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా నిర్వహిస్తారు. చతుర్వేదపండితుల వేదాశీర్వచనాలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, సహాయ కమిషనర్‌ రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు. వైదిక కార్యక్రమాలను ముత్య సత్యనారాయణ, నాగాభట్ల కామేశ్వరశర్మ, పాలంకి చినపట్టాభి, ఇంద్రగంటి సుధీర్‌ నిర్వహించారు.

వెండిరథంపై విహరించిన నూతన దంపతులు 

కల్యాణోత్సవ గ్రామోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 9గంటలకు వెండిరథంపై నవదంపతులను ఆశీనులు గావించి ప్రత్యేకపూజలు అనంతరం చైర్మన్‌ రోహిత్‌ రథోత్సవం ప్రారంభించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గ్రామంలో ప్రధానవీధుల్లో విహరించారు. 

వేడుకలో కానరాని ఉద్యోగులు 

ప్రతిష్ఠత్మకంగా  నిర్వహించే వన విహార మహోత్సవ వేడుకలో సిబ్బంది, పురోహితు లు పూర్తిస్థాయిలో హాజరుకాకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. సుమారు 70 లక్షల వ్యయంతో నిర్వహించిన ఈ వేడుకలో సిబ్బంది బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని గ్రామస్థులు భక్తులు, గ్రామస్థులు పేర్కొన్నారు. 

నేడు చక్రస్నానం 

సోమవారం చక్రస్నానం కార్యక్రమం వేడుకగా జరగనుంది. ఉదయం 9గంటలకు పంపాసరోవరం వద్దకు స్వామి,అమ్మవార్లను తీసుకునివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


Updated Date - 2022-05-16T07:07:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising