ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రికి రాత్రే కబ్జా

ABN, First Publish Date - 2022-01-24T05:51:54+05:30

మండలంలో కొంతమంది ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. రానున్న కాలంలో ప్రభుత్వానికి చెందిన చెరువులు కుంటలు, కాలువలు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే... గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామ పంచాయతీ నడిబొడ్డున వున్న ప్రభుత్వ భూమి రాత్రికి రాత్రే కబ్జాకు గురైంది.

కృష్ణునిపాలెంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోకవరం, జనవరి 23: మండలంలో కొంతమంది ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. రానున్న కాలంలో ప్రభుత్వానికి చెందిన చెరువులు కుంటలు, కాలువలు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే... గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామ పంచాయతీ నడిబొడ్డున వున్న ప్రభుత్వ భూమి  రాత్రికి రాత్రే కబ్జాకు గురైంది. ఉదయం లేచి చూడగానే ప్రభుత్వ భూమి గ్రావెల్‌, మట్టితో నిండి ఆక్రమణకు గురైంది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. దీనిపై స్థానిక రెవెన్యూ అధికారిని, గ్రామ పంచాయతీ కార్యదర్శిని గ్రామస్తులు వివరణ కోరగా తమకు ఎటువంటి సమాచారం లేదని, దీనిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణునిపాలెం రెవె న్యూ రికార్డును గ్రామ పెద్దలు పరిశీలించగా బ్రిటీష్‌కాలం నాటి నుంచి కూడా రిజిస్టర్లో సర్వే నెం.178లో ప్రభుత్వ భూమిగా పక్కా ఆధారాలతో ఉందని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు తెలిపారు. గత కొంతకాలంగా ఈ భూమిని కృష్ణునిపాలెం పంచాయతీ నిర్వాహకులు డంపింగ్‌ యార్డుగా ఉపయోగించుకుంటున్నారు. ఆక్రమణదారులు అడ్డగోలుగా డంపింగ్‌ యార్డుపై మట్టి పోసి ఫిల్లింగ్‌ చేశారు. ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించుకుంటే అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-01-24T05:51:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising