ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ ఏఐకేఎంస్ ధర్నా
ABN, First Publish Date - 2022-08-04T06:09:08+05:30
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ రాజమహేంద్రవరం మునిసిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహాం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) ధర్నా చేసింది.
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ రాజమహేంద్రవరం మునిసిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహాం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) ధర్నా చేసింది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాల రేవు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్, జిల్లా కార్యదర్శి పి.వెంకట్‌నాయుడు, అధ్యక్షుడు జె.సత్తిబాబు మాట్లాడారు. నూతన అటవీ సంరక్షణ నియమాలు-2022ను ఉపసంహరించుకోవాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఎంఎస్‌పీ(కనీస మద్ధతు ధర) గ్యారెంటీ చట్టం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, వరద సహాయక చర్యలు యుద్ధ ప్రతిపాధికన చేపట్టాలని డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం అడవుల నుంచి గిరిజనులను గెంటి వేయడానికి, అడవిలోని ఖనిజ సంపదను కార్పొరేట్ వ్యాపారులకు అప్పగించడానికి గిరిజన చట్టాల్లో సవరణ తీసుకువ చ్చిందని, దీనిని ఏఐకేఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఢిల్లీ రైతు ఉద్యమానికి కేంద్రం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు ఏవి రమణ, జిల్లా నాయకులు కే జోజి, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T06:09:08+05:30 IST