ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలోకి దూకి వ్యక్తి గల్లంతు

ABN, First Publish Date - 2022-12-15T23:45:09+05:30

కొవ్వూరులో గోదావరిలోకి దూకి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రామభద్రపురం గ్రామానికి చెందిన గుదాల దేవికి నూకరాజుతో వివాహమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, డిసెంబరు 15: కొవ్వూరులో గోదావరిలోకి దూకి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రామభద్రపురం గ్రామానికి చెందిన గుదాల దేవికి నూకరాజుతో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కొంతకాలం తర్వాత దేవి కొట్టాం గ్రామానికి చెందిన ముక్కిడిపల్లి శ్రీను(30)తో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో ఈ ఏడాది అక్టోబరు 20న ఇద్దరూ ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఈ నెల 13న శ్రీనుకు తల్లి ఫోన్‌చేసి.. దేవి భర్త నూకరాజు పాయకరావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడని, వెంటనే దేవిని తీసుకురావాలని చెప్పింది. దీంతో శ్రీను, దేవి, ఆమె కుమార్తెతో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. గురువారం మధ్యాహ్నం కొవ్వూరు గామన్‌బ్రిడ్జిపైకి వచ్చేసరికి, శ్రీను ఒక్కసారిగా బైక్‌ నిలుపుదలచేసి గోదావరిలోకి దూకి గల్లంతైనట్టు దేవి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-12-15T23:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising