ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ గ్యాస్‌ మంట

ABN, First Publish Date - 2022-05-25T06:16:15+05:30

వంట గ్యాస్‌ ధర మరో రూ.3 పెరిగింది. వాస్తవానికి అందరూ గ్యాస్‌ ధర బాగా తగ్గిపోయిందనుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో రూ. 3 పెంపు

ఉజ్వల లబ్ధిదారులకే రూ. 200 సబ్సిడీ

జిల్లాలో 6500 మందికే లబ్ధి


 (రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) 

 వంట గ్యాస్‌ ధర మరో రూ.3 పెరిగింది. వాస్తవానికి అందరూ గ్యాస్‌ ధర బాగా తగ్గిపోయిందనుకుంటున్నారు. కానీ కేంద్రం రూ.200 సబ్సిడీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది కేవలం ప్రధానమంత్రి జాతీయ ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్నవారికే. జిల్లాలో మొత్తం  5.5 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా ఉజ్వల పథకం కింద  కేవలం 6,500 వరకూ మాత్రమే ఉన్నాయి. అంటే రూ.200 సబ్సిడీ వీరికే వర్తిస్తోంది. ప్రస్తు తం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1033గా ఉంది.  ఇంటికి వచ్చేసరికి రూ. 1060 చార్జి చేస్తున్నారు.  మిగతా వినియోగదారులకు సబ్సిడీ ఎంత అనేది స్పష్టత లేదు. గత నెలలో సుమారు రూ.24 వరకూ వచ్చింది. ఉజ్వల పథకం లబ్ధిదారులు కూడా గ్యాస్‌ సిలిండర్‌ తీసుకున్నప్పుడు మొత్తం డబ్బు కట్టేయాలి. తర్వాత రూ.200 బ్యాంక్‌  ఖాతాలో వేస్తారు. గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.


Updated Date - 2022-05-25T06:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising