600 కిలోల గంజాయి స్వాధీనం
ABN, First Publish Date - 2022-08-04T06:00:23+05:30
ఏజెన్సీ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న గంజాయిని మోతుగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లక్కవరం జంక్షన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా 24 ప్లాస్టిక్ బ్యాగుల్లో తరలిస్తున్న 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మోతుగూడెం, ఆగస్టు3: ఏజెన్సీ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న గంజాయిని మోతుగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లక్కవరం జంక్షన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా 24 ప్లాస్టిక్ బ్యాగుల్లో తరలిస్తున్న 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒడిసాకు చెందిన శ్యామల్‌డే, మహారాష్ట్రకు చెందిన కామేష్ బిరసన్‌సింగ్ బాగెల్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సామి హస్ననియన్, బిహార్‌కు చెందిన రాజీవ్‌కుమార్, మహారాష్ట్రకు చెందిన తులసిదాస్ సఖరంను అరెస్టు చేశారు. వారి నుంచి 600 కిలోల గంజాయి, డీసీఎం వ్యాన్, మోటారు సైకిల్, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - 2022-08-04T06:00:23+05:30 IST