ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు సామర్లకోటను ముట్టడిస్తాం: Harsha kumar

ABN, First Publish Date - 2022-01-07T18:02:34+05:30

సామర్లకోటలో దళిత యువకుడు గిరీష్ ఆత్మహత్యకు కారణమైన ఎస్ఐ అభిమన్యును డిస్మిస్ చేసి అరెస్ట్ చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: సామర్లకోటలో దళిత యువకుడు గిరీష్ ఆత్మహత్యకు కారణమైన ఎస్ఐ అభిమన్యును డిస్మిస్ చేసి అరెస్ట్ చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు సాయంత్రంలోగా ఎస్ఐ అభిమన్యును అరెస్ట్ చేయకపోతే రేపు సామర్లకోటను ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న దళితులంతా రేపు ఉదయం 10 గంటలకు ఛలో సామర్లకోటకు తరలిరావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై దళితులంతా తాడోపేడో తేల్చుకుంటామన్నారు. వైసీపీ పాలనలో పోలీసుల దమనకాండ మితిమీరుతోందని మండిపడ్డారు.  ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ సామర్లకోటలో విచారణ చేపట్టి ఎస్ఐ అభిమన్యుతో పాటు కానిస్టేబుల్ సత్యనారాయణలను అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా పోలీస్ ఉన్నతాధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ దళితుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని హర్షకుమార్ విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2022-01-07T18:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising