ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి గడిస్తే గండం గట్టెక్కినట్లే

ABN, First Publish Date - 2022-07-18T07:00:28+05:30

గోదావరి వరద ఆది వారం రాత్రి నుంచి నిలకడగా కొనసాగుతోంది. భద్రా చలం వద్ద తగ్గుముఖం పట్టి ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తూ కోనసీమ నదీపాయల్లో నిలకడగా కొనసాగుతోంది.

సఖినేటిపల్లిలంకలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిలకడగా వరద ప్రవాహం
(అమలాపురం-ఆంధ్రజ్యోతి): గోదావరి వరద ఆది వారం రాత్రి నుంచి నిలకడగా కొనసాగుతోంది. భద్రా చలం వద్ద తగ్గుముఖం పట్టి ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తూ కోనసీమ నదీపాయల్లో నిలకడగా కొనసాగుతోంది. ఈ రాత్రి గడిస్తే గండం గట్టెక్కినట్టేనని నదీ పరివాహక లంక గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ప్రభుత్వశాఖల అధికారులు నదీ జల దిగ్బంధంలో చిక్కుకున్న బాధితుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్యంపై వారి నుంచి ఆగ్రహావేశాలు వ్యక్త మవుతున్నాయి. పది కిలోల బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేయడం మినహా మిగిలిన ఏవిధమైన సహాయ చర్యలు గ్రామాల్లో ఉన్న తమకు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. తాము ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాలకు వస్తే పూర్తి స్థాయిలో తమకు వసతి సౌకర్యాలు కల్పిస్తుందా అంటూ మీడియా ముందు బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటిగట్ల పరిరక్షణ విషయంలో జలవనరులశాఖ అధికారులు పత్తా లేకుండా పోయారనేది నదీ తీర గ్రామాల ప్రజల ప్రధాన ఆరోపణ. స్థానికులే బలహీనంగా ఉన్న ఏటిగట్లను కాపాడు కోవడంతో పాటు వశిష్ఠ, వైనతేయ గట్లపై నుంచి వరద  పొంగి ప్రవహిస్తుండడంతో వందల సంఖ్యలో ఇసుక బస్తాలువేసి కాపాడుకోవలసి వచ్చిందే తప్ప  ఏ ఇంజ నీరింగ్‌ అధికారి తమవైపు చూడలేదంటూ రాజోలు వాసులు ఆవేదన చెందారు. ఇక గ్రామాల్లో రాత్రివేళల్లో గడిపేందుకు కొవ్వొత్తుల పంపిణీ అని ప్రకటన చేసినప్పటికీ అవి పూర్తిస్థాయిలో లంకల్లోకి చేరలేదు. జిల్లా అధికారులతో పాటు వరద ప్రత్యేకాధికారులు ఆయా మండలాల్లో ఉన్న క్షేత్రస్థాయి వరద పరిస్థితులపై అవగాహన లేమితో వ్యవహరిస్తున్నారని, పైగా ఈ ప్రాంతానికి రెవెన్యూతో సహా వివిధ శాఖల అధికారులు కొత్తవారు కావడంతో అవగాహన లేక ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారపక్షానికి చెందిన నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక జిల్లా ఇన్‌చార్జి మంత్రి జోగి రమేష్‌, హోంమంత్రి తానేటి వనిత, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌లు పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజక వర్గాల్లోని ఎంపిక చేసిన ముంపు గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. అయితే లంక గ్రామాల్లో ఉన్న పరిస్థితులను మంత్రుల బృందం అధ్యయనం చేస్తే వారు పడుతున్న కష్టాలేంటో తెలుస్తాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. లంక గ్రామాల్లో వరద నీటిలో ఉన్న బాధితుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు(ఐవీ) ఆరోపించారు. ఆయా  గ్రామాల్లో లంకవాసులు పడుతున్న కష్టాలను పడవలపై వెళ్లి తెలుసుకున్నారు.

Updated Date - 2022-07-18T07:00:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising