ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకే

ABN, First Publish Date - 2022-08-05T05:15:02+05:30

15వ ఆర్థిక సంఘం నిధులు ఇకపై నేరుగా గ్రామ పంచాయతీలకు జమ చేయనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం రూరల్‌, ఆగస్టు 4: 15వ ఆర్థిక సంఘం నిధులు ఇకపై నేరుగా గ్రామ పంచాయతీలకు జమ చేయనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ తెలిపారు. రాష్ర్టానికి చెందిన పలువురు సర్పంచ్‌ల బృందం గురువారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని కలసి పలు సమస్యలను వివరించింది. అలాగే బండారులంక సర్పంచ్‌ పెనుమాల సునీత పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలకు కల్పించిన 29 అంశాలను వెంటనే  బదలాయించాలని సర్పంచ్‌లు కోరారు. పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.581 కోట్లు, 14వ ఆర్థికసంఘం పాత బకాయిలు రూ.125 కోట్లు తక్షణం పంచాయతీ ఖాతాలకు జమ చేయాలని విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిధుల విడుదలకు కృషి చేస్తానన్నారు. ఆర్థికంగా పంచాయతీలు వనరులు సమకూర్చుకునేలా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలని సూచించారు. భూగర్భ జలాల పెంపుదల కోసం ఇంకుడు గుంటలు తవ్వించాలని  కోరారు. కార్యక్రమంలో వారి వెంట అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ కార్యదర్శి జె.వీరాంజనేయులు, సర్పంచ్‌లు టి.కృష్ణమోహన్‌, సీహెచ్‌ సాంబశివరావు, అల్లాభక్ష్‌, నాగమణి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-08-05T05:15:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising