ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలి

ABN, First Publish Date - 2022-05-25T05:26:52+05:30

: నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్‌ మాధవీలత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తోకాడలో పట్టాలు పంపిణీలో పాల్గొన్న కలెక్టర్‌, ఎమ్మెల్యే 

రాజానగరం, మే 24 : నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు ఇంటి  నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్‌ మాధవీలత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. మండలంలోని తోకాడలో ప్రభు త్వం మంజూరుచేసిన ఇళ్ల స్థలాల పట్టాలు ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి మంగళవారం పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావాలన్నారు. ఇందుకు ప్రజా ప్రతినిధుల సహకారం అందిస్తే అభివృద్ధి పనులు వేగంగా చేపట్టగలమని ఈ విషయంలో ఎమ్మెల్యే రాజా నిదర్శనమన్నారు. ఈ లేఅవుట్‌లో రహదార్లు, విద్యుత్తు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు సకాలంలోనే కల్పిస్తామన్నా రు. ఇంటి నిర్మాణంకోసం ప్రభుత్వం అందించే రూ.1.80లక్షలతోపాటు డ్వాక్రా సంఘాల మహిళ లకు మరో రూ.50వేలు రుణ సౌకర్యం కల్పించి, ఈమొత్తంతో ఇంటి నిర్మాణం ప్రారం భించాలన్నారు. లబ్ధిదారులకు ఆయా దశల్లో ఇంటి నిర్మాణా లు పూర్తిచేసిన వెంటనే నిర్మాణ వ్యయం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు నవరత్నాల్లో భాగంగా ఉచితంగా ఇంటి స్థలాలు అందించి ఇళ్ల నిర్మాణం ప్రోత్సహిస్తుందన్నారు. ఇళ్ల స్థలాలు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. 2021-22కి సంబంధించి పీఎంఏవై కింద నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాల్లో రాజానగరంలో 482మందికి, కోరు కొండలో 620మందికి, సీతానగరంలో 221మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశా మన్నారు. ఎంపీపీ మండారపు సీతారత్నం, వైస్‌ ఎంపీపీ కొల్లి సత్య, జడ్పీటీసీ సభ్యుడు వాసంశెట్టి పెద్ద వెంకన్న, వైసీపీ మండల కన్వీనర్‌ దూలం పెద్ద, నెడ్‌క్యాప్‌ డైరెక్టర్‌ గండి నానిబాబు, నాయకులు గంగిశెట్టి సోమేశ్వరరావు, గండి వెంకట సుజాత, ప్రగడచక్రి, కొల్లి వీర్రాజు,  ప్రసాద్‌, అడబాల చినబాబు, ఆర్డీవో చైతన్య వర్షిణి, ఎంపీడీవో మూర్తి, హౌసింగ్‌ అధికారి బి.తారాసింగ్‌, ఏఎంసీ చైర్మన్‌ వేమగిరి కృష్ణ, ఇ.ఇ సోములు, డి.ఇ. పరశురామ్‌, ఏ.ఇ పరశురామ్‌, ఏఈకె నగేష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-05-25T05:26:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising