ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సవాళ్లను ఎదుర్కోవాలి’

ABN, First Publish Date - 2022-05-16T06:38:46+05:30

సవాళ్ళను ఎదుర్కొని కోఆపరేటివ్‌ బ్యాంక్‌లను ముందుకు తీసుకువెళ్ళాలని ఏపీ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాం క్స్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ ఫెడరేషన్‌ కార్యదర్శి సీహెచ్‌ రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, మే 15: సవాళ్ళను ఎదుర్కొని కోఆపరేటివ్‌ బ్యాంక్‌లను ముందుకు తీసుకువెళ్ళాలని ఏపీ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాం క్స్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ ఫెడరేషన్‌ కార్యదర్శి సీహెచ్‌ రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. స్థా నిక రివర్‌ వ్యూ కళ్యాణ మండపంలో ఆదివారం ఇన్నీసుపేట కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ కోళ్ల అచ్యుత రామారావు అధ్యక్షతన ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని కోఆపరేటివ్‌ అర్బన్‌బ్యాంక్స్‌ సిబ్బందికి ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ నిరర్ధక ఆస్తుల్ని తగ్గించేందుకు బ్యాంకులు కృషి చేయాలన్నారు. ఉద్యో గులు ఒత్తిడిని అథిగమించి విధాన నిర్ణయాల అమలుకు కృషి చేయాలని సూచించారు. ఇటీవల డిపాజిటర్లను మోసం చేసిన జయలక్ష్మి బ్యాంక్‌ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేయాలని, ఆ సొమ్మును ఎక్కడికి తరలించారో తేల్చాలని డిమాండ్‌ చేశారు. సొసైటీ బ్యాంక్‌ ఒకటి కాదన్న విషయాన్ని డిపాజిటర్లు గుర్తించాలన్నారు. కొందరు సొసైటీని బ్యాంకుగా నమ్మబలికి మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఏ ప్రమాదమొచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కొని కోఆపరేటివ్‌ బ్యాంక్‌లను రక్షించి ప్రగతి పథంలో నడిపించాలన్నారు. కార్యక్రమంలో జాంపేట కోఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బొమ్మన జయకుమార్‌, ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ గిరిజాల రామతులసి పాల్గొన్నారు. 


అనారోగ్య సమస్యలతో మహిళ ఆత్మహత్య 

రాజమహేంద్రవరం సిటీ, మే 15: రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరు గ్రామం వీవీనగర్‌లో ఓ మహిళ అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుందని త్రీటౌన్‌ పోలీసులు తెలిపారు. వీవీనగర్‌లో నివాసం ఉంటున్న పి.వెంకటరమణ భార్య వెంకటలక్ష్మి(42)కు బీపీ, షుగరు వ్యాధులున్నాయి. అలాగే అప్పుడప్పుడు కడుపునొప్పి వస్తుంది. ఈ నేపథ్యంలో షుగరు వ్యాధికి  తరచు ఇన్సులిన్‌ చేసుకోవడం, ఒళ్లు నొప్పులు తగ్గక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. వాటిని తట్టుకోలేక ఆదివారం ఉదయం భర్త వెంకటరమణ బయటకు వెళ్లిన సమయంలో సీలింగ్‌ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన భర్త ఆమెను చూసి షాక్‌కు గురయ్యాడు. పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-05-16T06:38:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising