ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2022-09-13T06:48:42+05:30

విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని, సీతారామరాజు చదువుకున్న ఉల్లితోట బంగారయ్య స్కూలుకు అల్లూరి పేరును చేర్చి మార్పు చేయాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 12: విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని, సీతారామరాజు చదువుకున్న ఉల్లితోట బంగారయ్య స్కూలుకు అల్లూరి పేరును చేర్చి మార్పు చేయాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ మాధవీలతకు రెండు వినతిపత్రాలు అందజేసినట్టు ఆయన తెలిపారు. అల్లూరి జీవించిన 27 ఏళ్లలో 13 సంవత్సరాలు రాజమహేంద్రవరంలోనే నివాసం ఉన్నారని, అలాగే గోదావరి గట్టు ప్రాంతంలోని ఉల్లితోట బంగారయ్య స్కూల్లో 6వ తరగతి వరకూ సీతారామరాజు చదువుకున్నాడని కలెక్టర్‌కు తెలియజేశామన్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ఇచ్చిన వినతిపత్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్‌కు అందజేసి దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి చీకట్ల శివన్నారాయణ, యర్ర ఉమామహేశ్వరరావు, ఎస్‌ఎస్‌ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-13T06:48:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising