ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగ సంఘాలకు మద్దతుగా సమ్మె నోటీసు

ABN, First Publish Date - 2022-01-29T04:41:15+05:30

అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ ఇచ్చిన పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని, కాంట్రాక్టు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 7నుంచి జరిగే నిరవధిక సమ్మెలకు సంఘీ భావం తెలుపుతూ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధుల ఆధ్వర్యంలో శుక్రవారం అమలాపురం మున్సిపల్‌ కమిషనర్‌ వి.అయ్య ప్పనాయుడుకు వినతిపత్రం అందజేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురంటౌన్‌, జనవరి 28: అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ ఇచ్చిన పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని, కాంట్రాక్టు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 7నుంచి జరిగే నిరవధిక సమ్మెలకు  సంఘీ భావం తెలుపుతూ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధుల ఆధ్వర్యంలో శుక్రవారం అమలాపురం మున్సిపల్‌ కమిషనర్‌ వి.అయ్య ప్పనాయుడుకు వినతిపత్రం అందజేశారు.  7నుంచి జరిగే సమ్మెకు ప్రజ లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె నోటీసు అందించిన వారిలో నాయకులు కొప్పుల సత్తిబాబు, ఏడుకొండలు పాల్గొన్నారు. 

పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లకు పీఆర్సీ వర్తింపజేయాలి

అమలాపురంటౌన్‌, జనవరి 28: రెండు దశాబ్ధాలుగా సర్వశిక్షాభియాన్‌లో పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లుగా పనిచేస్తున్న ఆర్ట్‌, క్రాఫ్ట్‌, పీఈటీలకు పదకొండో పీఆర్సీ వర్తింపచేసి మినిమం స్కేలు ఇవ్వడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ పీఈటీల జిల్లా సంఘ సమావేశం పోలిశెట్టి నరసింహకుమార్‌ అధ్యక్షతన అమలాపురం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. పార్ట్‌టైమ్‌ పదాన్ని తొలగించి ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్లుగా పేరు మార్చి ఫుల్‌టైమ్‌ జీవో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యమ కార్యా చరణపై ఈనెల 30న అమలాపురంలో జరిగే సమావేశాన్ని విజయ వంతం చేయాలని కోరారు. రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.రాజేంద్రప్ర సాద్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రామ్మోహనరావు, శివనాగమల్లేశ్వరి, ఉపాధ్యక్షులు సత్యానందరం, కామేశ్వరరావు, కార్యదర్శి మధు మూర్తి, సలోమి, యజ్ఞేశ్వరరావు, అశోక్‌బాబు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-29T04:41:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising