మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట!
ABN, First Publish Date - 2022-12-07T00:18:11+05:30
మండలంలోని పెద్దనాపల్లిలో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికార యంత్రాంగం చర్య లు చేపట్టింది. గ్రామంలోని పోలవరం ఇరిగేషన్ ఎడమ కాలువ గట్టు వెంబడి యథేచ్ఛగా సాగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై మంగళవారం మీడియాలో వెలువడిన కథనాలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. రాత్రి వేళల్లో యంత్రాల సహాయంతో మట్టిని అక్రమార్కులు తవ్వి వాహనాలపై తరలించి
ఏలేశ్వరం, డిసెంబరు 6: మండలంలోని పెద్దనాపల్లిలో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికార యంత్రాంగం చర్య లు చేపట్టింది. గ్రామంలోని పోలవరం ఇరిగేషన్ ఎడమ కాలువ గట్టు వెంబడి యథేచ్ఛగా సాగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై మంగళవారం మీడియాలో వెలువడిన కథనాలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. రాత్రి వేళల్లో యంత్రాల సహాయంతో మట్టిని అక్రమార్కులు తవ్వి వాహనాలపై తరలించి సొమ్ము చేసుకుంటున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై పోలవరం ఏఈఈ లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఇరిగేషన్ సిబ్బంది దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించగా యంత్రం సహాయంతో కాలువ గట్టు వెంబడి మట్టి గుట్టలను తవ్వుతున్న వైనాన్ని గుర్తించారు. మట్టిని తవ్వుతున్న యంత్రంతో పాటు ప్రదేశంలో మట్టిని తరలించేందుకు ఉన్న రెండు టిప్పర్లను అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీ్‌సస్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎస్.పొన్నాలు సిబ్బందితో కలసి గట్టు వెంబడి తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
Updated Date - 2022-12-07T00:18:12+05:30 IST