కరోనా కట్టడికి చర్యలు
ABN, First Publish Date - 2022-01-13T05:34:39+05:30
ఏలేశ్వరం, జనవరి 12: కరోనా వైరస్ మరోసారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా డిప్యూటీ కలెక్టర్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎమ్.వెంకటేశ్వరావు నేతృత్వంలో బుధవారం మున్సిపల్, రెవెన్యూ, వైద్యఆరోగ్యశాఖలకు చెందిన అధికారులు మండలంలో కొవిడ్ కేసులు పెరగకుండా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో సమావేశమై ప్రజల్లో చైతన్యం కల్పిం
ఏలేశ్వరం, జనవరి 12: కరోనా వైరస్ మరోసారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా డిప్యూటీ కలెక్టర్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎమ్.వెంకటేశ్వరావు నేతృత్వంలో బుధవారం మున్సిపల్, రెవెన్యూ, వైద్యఆరోగ్యశాఖలకు చెందిన అధికారులు మండలంలో కొవిడ్ కేసులు పెరగకుండా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో సమావేశమై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొవిడ్ బారిన వారి కోసం క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుకు సంబందించి ప్రభుత్వ సాంఘికసంక్షేమ గురుకుల కళాశాల భవనాలను పరిశీలించారు. ఎస్‌ఐ సీహెచ్.విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్ కొండలరావు, మేనేజర్ శ్రీనివాసరావు పట్టణంలోని పాతబస్టాండ్ సెంటర్‌లో ఆర్‌అండ్‌బీ రహదారిపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి మాస్క్‌లు ధరించనివారికి అపరాధ రుసుం విధించడంతో పాటు కరోనా నిబంధనలు, మాస్క్ వల్ల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో తహశీల్దార్ రజనీకుమారీ, ఎంపీడీవో గోవిందు, ఆర్‌ఐ పొన్నాలు, కౌన్సిలర్లు అలమండ చలమయ్య, సుంకర రాంబాబు, సామంతుల చిన్నారావు, అవసరాల కిషోర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-13T05:34:39+05:30 IST