ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేయనున్న టీడీపీ

ABN, First Publish Date - 2022-12-07T01:12:19+05:30

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని, వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడుతామని తెలుగుదేశం పాలిట్‌బ్యూరో సభ్యుడు, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగిస్తున్నారని, జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో రానున్నాయన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాష్ట్రాన్ని డైవర్షన్‌ పాలిటిక్స్‌తో నడిపిస్తున్న సీఎం

  • రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి

రాజమహేంద్రవరం రూరల్‌/ అర్బన్‌, డిసెంబరు 6: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని, వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడుతామని తెలుగుదేశం పాలిట్‌బ్యూరో సభ్యుడు, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగిస్తున్నారని, జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో రానున్నాయన్నారు. తుగ్లక్‌ సీఎం రాష్ట్రాన్ని డైవర్షన్‌ పాలిటెక్నిక్‌తో నడిపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని, నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్న చందంగా కర్నూలులో చంద్రబాబుకు వచ్చిన జనాలను చూసి వైసీపీ నాయకులు రాయలసీమ గర్జన పేరుతో నిర్వహించిన సభ అట్టర్‌ప్లాప్‌ అయిందన్నారు. ప్రభుత్వ మొండివైఖరి వల్లనే రాష్ట్రంలో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నాయన్నారు. ఆంధ్రరాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేయడంతో యువతకు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారన్నారు. వైసీపీ పాలకులు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ భూ కబ్బాలకు పాల్పడుతున్నారన్నారు. త్వరలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఎమ్మెల్యే గోరంట్ల స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-07T01:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising