ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాభివృద్ధికి పెద్దపీట : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-06-30T07:15:33+05:30

ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని కలెక్టరు మాధవీలత అన్నారు. మండలంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లపూడి, జూన్‌ 29: ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని కలెక్టరు మాధవీలత అన్నారు. మండలంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. అన్నదేవరపేటలో నాడు-నేడులో నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాన్ని, గజ్జరం, అన్నదేవరపేట లేఅవుట్లను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీబీఎస్‌ స్కూల్‌లో ప్లస్‌ వన్‌, ప్లస్‌టు మాదిరిగానే పాఠశాల ఉన్నత పాఠశాల ఆవరణలో గర్ల్స్‌ జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బాలికలు తమ చదువులను మధ్యలో నిలిపివేయకుం డా జూనియర్‌ కాలేజీలో చదువుకునేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. అందుకుగాను మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కోటి 76 లక్షలతో 15 తరగతి గదులు నిర్మిస్తున్నామన్నారు. స్కూల్‌ యాజమాన్య కమిటీల ఆధ్వర్యంలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయడానికి కృషిచేయాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో మల్లిబాబు, ఎంఈవో కెంపు రత్నం, జడ్పీ వైస్‌ చైర్మన్‌ శ్రీలేఖ, సర్పంచ్‌ ఎలిపే సుధారాణి, తహశీల్దారు షారాశాంతి, ఎంపీడీవో రాజశేఖర్‌, కార్యదర్శి అనురాధ పాల్గొన్నారు.

అర్హత ఉన్నవారందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం

అర్హత ఉన్న వారందరికీ గృహాలు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టరు మాధవీలత అన్నారు. గజ్జరం, అన్నదేవరపేటలో ఏర్పాటుచేసిన లేఅవుట్ల స్థలాలను ఆమె పరిశీలించారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులంతా  గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. పూర్తయిన నిర్మాణాలకు సైజుల ఆధారంగా బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టరు మాధవీలత లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లా డుతూ సకాలంలో కరెంటు, తాగునీరు సరఫరా చేస్తే నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. అలాగే ఇళ్లు కావాల్సిన అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. 



Updated Date - 2022-06-30T07:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising