ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూ.గో.జిల్లా: అక్రమంగా మట్టిని తరలిస్తున్న వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2022-02-01T17:34:09+05:30

తూ.గో. జిల్లా: లంక భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయా?...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూ.గో. జిల్లా: లంక భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయా? కోనసీమలోని నదీ పరివాహక ప్రాంతాల్లో యధేచ్చగా మట్టిని తరలిస్తున్నారా? వైసీపీ నేతలే మట్టి మాఫియాకు అండగా ఉంటున్నారా? 24 గంటలపాటు ఏకధాటిగా మట్టి తవ్వకాలు జరుపుతూ కోట్ల రూపాయలతో జేబులు నింపుకుంటున్న మట్టి మాఫియాపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.


గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో యధేచ్చగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. కొంతమంది వైసీపీ నేతలు తమ అనుచరులతో అక్రమమట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు జరిపి వందల సంఖ్యలో లారీలతో మట్టిని తరలిస్తున్నారు. ఇటుక బట్టీలకు, లే అవుట్లు పూడ్చేందుకు మట్టిని అమ్ముకుంటున్నారు. కోనసీమలోని లంక గ్రామాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో మట్టి కోసం వందల సంఖ్యలో లారీలు క్యూ కడుతున్నాయి. వైసీపీ నేతల కనుసన్నల్లోనే మట్టి అక్రమ తవ్వకాలు జరగడంతో అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. మట్టి మాఫియా ప్రతినిధులు అధికారులకు భారీగా ముడుపులు కట్టబెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2022-02-01T17:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising