ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ డ్రెయిన్ల ఆధునికీకరణకు రంగం సిద్ధం

ABN, First Publish Date - 2022-12-10T00:57:42+05:30

జిల్లాలో రెవెన్యూ డ్రెయిన్ల సర్వే పూర్తయిందని, ఆధునికీకరణకు పది రోజుల్లోగా టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉద్యాన విశ్వవిద్యాలయ బోర్డు సభ్యుడు జిన్నూరి వెంకటేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప్పలగుప్తం, డిసెంబరు 9: జిల్లాలో రెవెన్యూ డ్రెయిన్ల సర్వే పూర్తయిందని, ఆధునికీకరణకు పది రోజుల్లోగా టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉద్యాన విశ్వవిద్యాలయ బోర్డు సభ్యుడు జిన్నూరి వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన వ్యవసాయ సలహామండలి సమావేశంలో డ్రెయిన్ల సమస్యలపై రైతులు నిలదీశారు. రెండు రోజులుగా పోటు సమయంలో సముద్ర జలాలు డ్రెయిన్లలోకి వేగంగా ప్రవహించడంతో పొలాల్లోకి ఉప్పునీరు ప్రవేశించి నారుమళ్లు దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. గొరగనమూడి, ఉత్తర, దక్షిణ పీకాలేరు డ్రెయిన్లు పూడికతో మూసుకుపోయి పొలాల్లోని నీరు బయటకు పోవడం లేదన్నారు. జిల్లా కలెక్టర్‌తో ఈ అంశంపై మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని జిన్నూరి రైతులకు భరోసా ఇచ్చారు. వ్యవసాయాధికారి జి.కుమార్‌బాబు దాళ్వా సాగు యాజమాన్య పద్ధతులపై వివరించారు.

Updated Date - 2022-12-10T00:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising