ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధవళేశ్వరం గ్రామస్థుల రిలే నిరాహారదీక్ష

ABN, First Publish Date - 2022-08-11T06:37:26+05:30

ధవళేశ్వరం పంచాయతీలో అవకతవకలపై పూర్తి విచారణ చేపట్టాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

పంచాయతీ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధవళేశ్వరం, ఆగస్టు 10 : ధవళేశ్వరం పంచాయతీలో అవకతవకలపై పూర్తి విచారణ చేపట్టాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. పంచాయతీ దుస్థితిపై  జేఏసీగా ఏర్పడిన గ్రామస్థులు, నాయకులు బుధవారం  పంచా యతీ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అధ్వానంగా ఉన్న పారిశుధ్యం మెరుగుపరచాలని కార్యదర్శులుగా పని చేసి అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పూర్తి విచారణ చేసి దుర్వినియోగం అయిన సొమ్మును రాబట్టి గ్రామాభివృద్ధికి వినియోగించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం దీక్షలో నూకల రామకృష్ణప్రసాద్‌, ఎం. నాగ రాజు, దొడ్డి బాబ్జి, కరణం రామారావు, ఎస్‌. శ్రీరాం, కె.సూరిబాబు పాల్గొన్నారు. జేఏసీ కన్వీనర్లు పండూరి అప్పారావు, ఒంటెద్దు స్వామి, పన్నాల వెంకటలక్ష్మి, ముత్యాల పోసి కుమార్‌,విన్నకోట సత్తిబాబు, ఎడ్ల మహేష్‌, టీడీపీ నాయకులు యర్రమోతు ధర్మరాజు, పిన్నంటి ఏకబాబు, జనసేన నాయకుడు మట్టపర్తి నాగరాజు, టీడీపీ రూరల్‌ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ గోరంట్ల రవిరామ్‌కిరణ్‌, మచ్చేటి శివసత్యప్రసాద్‌, సావాడ శ్రీనివాస రెడ్డి, షేక్‌ అమీనా సందర్శించి సంఘీభావం ప్రకటించారు.

Updated Date - 2022-08-11T06:37:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising