ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరు కోసం పోరాటం

ABN, First Publish Date - 2022-08-17T06:52:18+05:30

ఊరు కోసం రోడ్డెక్కారు.. అయినా అటు నాయకుల్లోనూ ఇటు పాలకుల్లోనూ కనీస స్పందన కానరావడంలేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడడం లేదు.

పంచాయతీ ఎదుట రోడ్డుపై బైఠాయించి కందుల దుర్గేష్‌, జేఏసీ నాయకుల నిరసన ప్రదర్శన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధవళేశ్వరంలో సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కి నిరసన 


ధవళేశ్వరం, ఆగస్టు 16 : ఊరు కోసం రోడ్డెక్కారు.. అయినా అటు నాయకుల్లోనూ ఇటు పాలకుల్లోనూ కనీస స్పందన కానరావడంలేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడడం లేదు.  చేసేది లేక చివరకు మంగళవారం ప్రధాన రహదారిపై బైఠా యించి నిరసన ప్రదర్శన చేశారు. ధవళేశ్వరం గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని.. కార్యదర్శులు అవినీతిపై విచారణ విచారణ జరిపి కాజేసిన సొమ్మును పంచాయతీకి జమ చేయాలని డిమాండ్‌తో గ్రామస్థులు జేఏసీగా గత ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.   అయినా ఎటువంటి కదలిక లేదు. ఈ నేపథ్యంలో  మంగళవారం గ్రామస్థులతో కలిసి జనసేన జిల్లా అధ్యక్షుడు దుర్గేష్‌ రోడ్డుపై బైఠాయించారు. గ్రామస్థుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు.ఆయన మాట్లాడుతూ ఆరు రోజులుగా రిలే దీక్షలతో తమ నిరసన తెలుపుతున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడం వారి బాధలు అడిగి తెలుసుకోకపోవడం విచారకరమన్నారు. అధికారుల్లో కదలిక వచ్చేలా ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలి పారు. దీనిలో భాగంగా బుధవారం గ్రామ పంచా య తీని ముట్టడిస్తామని జేఏసీ నాయకులు తెలిపా రు.గ్రామస్థులంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. ఇకనైనా అధికారులు స్పందించి ఒకసారి ధవళేశ్వరంలో పర్యటించాలన్నారు. అనంతరం జనసేన నాయకుడు యడ్ల మహేష్‌, వి. బాలు, తాజా వాసు, యడ్ల ప్రవీణ్‌, బి.సత్యగణేష్‌ రిలే దీక్షల్లో పాల్గొనగా సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.  

Updated Date - 2022-08-17T06:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising