ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గడపగడపకూ’ సమస్యల వెల్లువ

ABN, First Publish Date - 2022-05-23T06:29:42+05:30

పాలగుమ్మి శివారు కంభం పాడు కాలనీలో ఆదివారం సాయంత్రం మంత్రి పినిపే విశ్వ రూప్‌ ఆధ్వర్యంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం రూరల్‌, మే 22: పాలగుమ్మి శివారు కంభం పాడు కాలనీలో ఆదివారం సాయంత్రం మంత్రి పినిపే విశ్వ రూప్‌ ఆధ్వర్యంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ చేపట్టారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడిచిపోతున్నా సొంత ఇంటి కల నెరవేరలేదని పలువురు పేర్కొన్నారు. పూరిళ్లలోనే కాలం గడపాల్సి వస్తోందని గృహ నిర్మాణ రుణాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నామని పలువురు మహిళలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్‌ తీగలు ప్రమాదంగా మారాయని ఆ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రహదారులు నిర్మించి ఏళ్లు గడిచిపోతున్నా మురుగు నీరు వెళ్లేందుకు డ్రైన్లు నిర్మించకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం అందిం చిన లబ్ధి పత్రాలతో పాటు పలువురికి గృహ నిర్మాణ రుణ మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో దృశ్య కళల అకాడమీ చైర్‌పర్సన్‌ కుడుపూడి సత్యశైలజ, ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, సెంట్రల్‌ బోర్డు చైర్మన్‌, కుడుపూడి బాబు, జడ్పీటీసీ పందిరి శ్రీహరి, సర్పంచ్‌ కుడు పూడి రామలక్ష్మి, ఎంపీటీసీ పాలగుమ్మి విజయ, నాయకులు బొంతు గోవిందుశెట్టి, బొక్కా ఆదినారాయణ, కాట్రు సత్య చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-23T06:29:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising