ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ సేవలు స్ఫూర్తిదాయకం

ABN, First Publish Date - 2022-04-29T06:18:40+05:30

అపర అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ సేవలు అనుసరణీయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాఽథ్‌బాబు పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తితో యువత సేవా మార్గంవైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

పి.గన్నవరం అక్విడెక్టు వద్ద డొక్కా సీతమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, ఏప్రిల్‌ 28: అపర అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ సేవలు అనుసరణీయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తితో యువత సేవా మార్గంవైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా పి.గన్నవరం కొత్త అక్విడెక్టు వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీతమ్మ స్ఫూర్తితో తాను ‘కోనసీమ ఆహార నిధి’ స్థాపించినట్టు వ్యవస్థాపక అధ్యక్షుడు వీరంశెట్టి సతీష్‌ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు దుప్పట్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డొక్కా భీమకామేశ్వరరావు, ఆరుమల్లి లాల్‌బాబు, ఆకుల రాజు పాల్గొన్నారు.


మండపేట: ఆంధ్ర అన్నపూర్ణగా వెలుగొందిన డొక్కా సీతమ్మ మన పట్టణంలో జన్మించడం మనం చేసుకున్న అదృష్టమని పలువురు వక్తలు అన్నారు. సీతమ్మ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని బూరుగుంట చెరువు వద్దనున్న ఆమె విగ్రహానికి పలువురు నాయకులు, వాకర్స్‌ క్లబ్‌తో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఆకలి అంటే చాలు అన్నం పెట్టిన మహా తల్లిగా అమె సేవలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ న్యాయవాది కేఆర్‌సీ నారాయణరెడ్డి అన్నారు. పేదలకు అన్నదానం చేశారు.

Updated Date - 2022-04-29T06:18:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising