అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
ABN, First Publish Date - 2022-09-09T07:06:36+05:30
ఏజెన్సీలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డీఎం అండ్‌హెచ్‌వో బి.సుజాత అధి కారులను ఆదేశించారు.
రంపచోడవరం, సెప్టెంబరు 8: ఏజెన్సీలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డీఎం అండ్‌హెచ్‌వో బి.సుజాత అధి కారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో గురువారం ఏడు మండలాల పీహె చ్‌సీ వైద్యాధికారులు, సీనియర్ అసి స్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీటీసీవో వైద్యాధికారి విశ్వేశ్వరనాయుడు, ఏడీఎంహెచ్‌వో అనూష, వైద్యాధికారులు, డిప్యూటీ డెమో అధికారి రవికుమార్, ఎంపీహెచ్‌ఈవో పీటర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-09-09T07:06:36+05:30 IST