ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే సీపీఎస్‌ రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-09-08T06:55:49+05:30

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను ముఖ్య మంత్రి జగన్‌ చిత్తశుద్థితో రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం రూరల్‌, సెప్టెంబరు 7: కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను ముఖ్య మంత్రి జగన్‌ చిత్తశుద్థితో రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ దినోత్సవ సందేశంగా ముఖ్యమంత్రి జగన్‌ మాటా ్లడుతూ చిత్తశుద్ధితో పెన్షన్‌ విషయం పరి ష్కారానికి కృషి చేస్తున్నామని, ఉపాధ్యాయులను ఇబ్బందిపెట్టే ఉద్దేశం లేదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమలాపురం ఎంప్లాయీస్‌ హోమ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఐవీ మాట్లాడారు. ఇప్పటికే రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేసిన విషయాన్ని జగన్‌ ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఉపాధ్యా యులకు ఇచ్చిన హామీని మరచి పోవద్దని హితవు పలికారు. అడక్కు ండానే అరవై రెండేళ్లకు ఉద్యోగ విరమణ వయసును పెంచడం అనేది రాజకీయ ప్రయో జనం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప ఉద్యోగుల కోసం చేసింది కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై పెన్షనరీ బెనిఫిట్లు, ఆర్థికభారాన్ని రెండేళ్ల పాటు వాయిదా  వేసుకునేందుకే ఉద్యోగ విరమణ వయసును పెంచిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులు సీపీఎస్‌ రద్దు కోసం చేసే ఉద్యమాలు, తిరోగమన పీఆర్సీకి వ్యతిరేకంగా చేసే పోరాటాలు మీడియా  ప్రేరేపిత పోరాటాలుగా ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పీఆర్సీలో జరిగిన నష్టం, మోసం సీపీఎస్‌పై మాట తప్పడం, యాప్‌ల విషయంలో ఉపాధ్యాయులను రోజువారీ ఇబ్బందులకు గురి చేయడం తదితర కారణాల వల్లే ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రభుత్వ విధానాలే ఉద్యోగుల తీవ్ర అసంతృప్తికి, భారీ సమీకరణకు కారణమని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించడం మాని ఉద్యమాలను అణిచివేసే విధానాలను విర మించుకోవాలని ఎమ్మెల్సీ ఐవీ హితవు పలికారు.

Updated Date - 2022-09-08T06:55:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising